Share News

ప్రణయ్‌ కులోన్మాద హత్య కేసు..

ABN , Publish Date - Sep 25 , 2026 | 12:31 AM

నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్‌ కులోన్మాద హత్య కేసులో నిందితుడు అబ్దుల్‌ బారీ(50) గుండెపోటుతో మృతిచెందాడు.

ప్రణయ్‌ కులోన్మాద హత్య కేసు..
abdulbari

నిందితుడు అబ్దుల్‌ బారీ మృతి

నల్లగొండ క్రైం, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్‌ కులోన్మాద హత్య కేసులో నిందితుడు అబ్దుల్‌ బారీ(50) గుండెపోటుతో మృతిచెందాడు. ఏ-4 నిందితుడిగా చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న బారీ గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. జైలు అధికారులు గాంధీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గుజరాత్‌ మాజీ మంత్రి హరేన్‌ పాండ్య హత్య కేసులోనూ అబ్దుల్‌ బారీ ఏడు సంవత్సరాల పాటు జైలుశిక్ష అనుభవించాడు. తన కుమార్తె అమృతను ప్రేమ వివాహం చేసుకున్న ప్రణయ్‌ను ఆమె తండ్రి మారుతీరావు 2018 సెప్టెంబరు 14న మిర్యాలగూడలో హత్య చేయించాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడైనమారుతిరావు 2020లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఏ-2గా ఉన్న సుభాష్‌ కుమార్‌శర్మకు కోర్టు ఉరిశిక్ష విధించగా, మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధించింది.

Updated Date - Sep 25 , 2026 | 12:31 AM