Share News

పులిచింతల ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి

ABN , Publish Date - Jul 02 , 2026 | 12:16 AM

చింతలపాలెం మండలం సరిహద్దులోని పులిచింతల ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్న టీఎ్‌సజెనకో పవర్‌ప్లాంట్‌లో బుధవారం విద్యుత ఉత్పత్తి ప్రారంభమైంది. ఎగువన తగినంత వర్షాలు లేకపోవడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టా సాగునీటి అవసరాల కోసం సుమారు 2000 క్కూసెక్కుల నీటిని వినియోగిస్తూ 15 మెగావాట్ల విద్యుతను ఉత్పత్తి చేస్తున్నారు.

పులిచింతల ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి

రోజుకు 15 మెగావాట్ల విద్యుదుత్పత్తి

చింతలపాలెం, జూలై 1 (ఆంధ్రజ్యోతి):చింతలపాలెం మండలం సరిహద్దులోని పులిచింతల ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్న టీఎ్‌సజెనకో పవర్‌ప్లాంట్‌లో బుధవారం విద్యుత ఉత్పత్తి ప్రారంభమైంది. ఎగువన తగినంత వర్షాలు లేకపోవడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టా సాగునీటి అవసరాల కోసం సుమారు 2000 క్కూసెక్కుల నీటిని వినియోగిస్తూ 15 మెగావాట్ల విద్యుతను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టులో నీటిమట్టం గణనీయంగా తగ్గింది. గరిష్ఠ నీటిమట్టం 175 అడుగులు కాగా, ప్రస్తుతం 166 అడుగుల వద్ద నీరు ఉంది. మొత్తం 45 టీఎంసీలకు ప్రస్తుతం 33టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎగువన ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులకు త్వరలో వరద రాకపోతే రాబోయే రెండు నెలల్లోనే పులిచింతల ప్రాజెక్టు ఖాళీగా అయ్యే పరిస్థితి నెలకొంది.

Updated Date - Jul 02 , 2026 | 12:17 AM