పోచంపల్లి ఇక్కత వసా్త్రలు అద్భుతం
ABN , Publish Date - Mar 20 , 2026 | 12:20 AM
ఖండాంతర ఖ్యాతిగాంచిన పోచంపల్లి చేనేత టైఅండ్‌డై ఇక్కత వసా్త్రలు అద్భుతమని విదేశీ డిఫెన్స అధికారులు కితాబునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై అధ్యయనంలో భాగంగా న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స అకాడమీ ఆధ్వర్యంలో వివిధ దేశాలకు చెందిన 10మంది డిఫెన్స అధికారులు గురువారం యాదాద్రి-భువనగిరి జిల్లా భూదానపోచంపల్లిలో క్షేత్ర పర్యటన చేశారు.
భూదానపోచంపల్లి, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ఖండాంతర ఖ్యాతిగాంచిన పోచంపల్లి చేనేత టైఅండ్‌డై ఇక్కత వసా్త్రలు అద్భుతమని విదేశీ డిఫెన్స అధికారులు కితాబునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై అధ్యయనంలో భాగంగా న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స అకాడమీ ఆధ్వర్యంలో వివిధ దేశాలకు చెందిన 10మంది డిఫెన్స అధికారులు గురువారం యాదాద్రి-భువనగిరి జిల్లా భూదానపోచంపల్లిలో క్షేత్ర పర్యటన చేశారు. బృందంలో బంగ్లాదేశ, ఒమెన, ఉజ్బెకిస్తాన తదితర దేశాలకు చెందిన నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ తదితర శాఖల అధికారులు ఉన్నారు. పట్టణంలోని కళా పునర్వి చేనేత యూనిట్‌ను వారు సందర్శించి చేనేత టైఅండ్‌డై వసా్త్రల తయారీ ప్రక్రియలైన టైయింగ్, డైయింగ్, డిజైనింగ్, వార్పింగ్, రీలింగ్, వీవింగ్ తదితర ప్రక్రిలయను వారు పరిశీలించారు. మగ్గంపై చేనేత టైఅండ్‌డై పట్టు చీరను తయారు చేసే విధానాన్ని వారు పరిశీలించారు. కార్మికులు రూపొందిస్తున్న డిజైన్లను పరిశీలించి కళాకారుల అద్భుతమైన కళాత్మక ప్రతిభను ప్రశంసించారు. అనంతరం పోచంపల్లి రూరల్ సెంటర్‌లోని లీవ్‌టుక్లాత ప్రాసెసింగ్ యూనిట్‌ను సందర్శించారు. వెదిరె రాంచంద్రారెడ్డి విగ్రహాన్ని సందర్శించారు. భూదానోద్యమం గురించి తెలుసుకున్నారు. వారి వెంట యాదాద్రిభువనగిరి జిల్లా చేనేత శాఖ అదనపు డైరెక్టర్ శ్రీనివా్‌సరావు, నోడల్ అధికారి భరతరెడ్డి, తహసీల్దారు శ్రీనివా్‌సరెడ్డి, ఆర్‌ఐ వెంకట్‌రెడ్డి, ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి, చైర్మన భారత వాసుదేవ్, చేనేత కళా పునర్వి యూనిట్ నిర్వాహకుడు సాయిని భరత, చేనేత సహకార సంఘం మేనేజర్ రుద్ర ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.