హమ్మయ్య సమస్య తీరినట్టే !
ABN , Publish Date - Aug 06 , 2026 | 12:01 AM
ఇండోర్ స్టేడియం ప్రహరీ నిర్మాణానికి సర్వే నాలుగేళ్లుగా పెండింగ్‌లో విద్యుత్ టవర్ల పనులు పూర్తి
(ఆంధ్రజ్యోతి- భువనగిరిటౌన్)
జిల్లాకేంద్రం భువనగిరిలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న రెండు ప్రధాన సమస్యల పరిష్కారానికి మార్గాలు సుగమమయ్యాయి. ఈమేరకు పనులు కూడా ప్రారంభం కావడం విశేషం. పట్టణంలోని ఇండోర్ స్టేడియాన్ని కబ్జాల నుంచి విముక్తి లభించనుండగా చివరి దశలో ఆగిన కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టిన విద్యుత్ టవర్ల మిగులు పను లు పూర్తి కాగా త్వరలోనే పట్టణ ప్రధాన రహదారి, బస్తీల్లో కరెంటు కష్టాలు తీరనున్నాయి. రెండు ప్రఽ దాన సమస్యలను పరిష్కరించడంతో ఎమ్మెల్యే కుం భం అనిల్‌కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ పరిష్కారానికి కృషి చేసిన అధికారులు, నాయకులను అభినందించారు. కాగా ఈ రెండు ప్రధాన సమస్యల పరిష్కారంలో నెలకొన్న జాప్యంపై ఆంధ్రజ్యోతిలో పలు కథనాలు ప్రచురితమైన విషయం విధితమే.
ఆక్రమణల నుంచి ఇండోర్ స్టేడియానికి విముక్తి
భువనగిరిలోని ఏకైక క్రీడా ప్రాంగణం, ఇండోర్ స్టేడియానికి ఆక్రమణల నుంచి విముక్తి లభిస్తున్నది. స్థానిక తారకరామానగర్‌లో సర్వే నెంబర్ 153/3లో 3.10ఎకరాల విస్తీర్ణంలో 4సెప్టెంబరు 19 98లో ఇండోర్ స్టేడియం నిర్మించారు. కానీ ప్రహరీ నిర్మించకపోవడంతో వెలుపలి భాగం ఆక్రమణలకు గురవుతున్నది. ఈ నేపథ్యంలో జూలై 23న కలెక్టర్ అనురాగ్ జయంతి, మునిసిపల్ చైర్‌పర్సన్ తంగెళ్లపల్లి శ్రీవాణి ఇండోర్ స్టేడియాన్ని పరిశీలించి ఆక్రమణలపై చర్యలు తీసుకుని ప్రహరీ నిర్మించాలంటూ అధికారులను ఆదేశించడంతో మంగళవారం మునిసిపల్ కమిషనర్ చంద్రప్రకాశ్‌రెడ్డి, తహసీల్దార్ కె జగన్‌మోహన్ ప్రసాద్, అధికారులు ఇండోర్ స్టేడియాన్ని పరిశీలించి సర్వే నిర్వహించారు. కౌన్సిలర్లు ఎండీ లయాక్ అహ్మద్, ఎండీ సుమయ్య తబస్సుం, అహ్మద్, సంఘవి కరుణాకర్ పాల్గొన్నారు.
విద్యుత్ టవర్ల మిగులు పనులు పూర్తి
పట్టణ ప్రధాన రహదారి 100 ఫీట్ల విస్తరణ పను ల్లో భాగంగా నాలుగేళ్ల క్రితం రూ. 9 కోట్లతో చేపట్టిన విద్యుత్‌టవర్ల పనులు సుమారు 8నెలల క్రితం 95 శాతం పూర్తయి కేవలం మూడు టవర్ల వివాదంతో ఆటకెక్కింది. ఈ నేపథ్యంలో నెల రోజులుగా సాగిన మంత్రాంగం ఫలితంగా ఓ ప్రైవేటు స్కూల్ ఆవరణలో ఉన్న మూడు టవర్లకు ఆదివా రం పెండింగ్ విద్యుత్ తీగల బిగింపు పనులను పూర్తి చేశారు. దీంతో పట్టణ ప్రధాన రహదారి వెం ట ఉన్న పాత విద్యుత్ లైన్లు త్వరలో తొలగించి త్వరలోనే వినియోగంలోకి తెస్తామని ట్రాన్స్‌కో డీఈ వెంకటేశ్వర్లు, ఏఈ సాయికృష్ణ తెలిపారు. అలాగే ప నుల పూర్తితో పహాడినగర్, ప్రగతినగర్ ,కిసాన్‌నగర్, తారక రామానగర్ బస్తీల్లో 33 కేవీ స్తంభాల తీగలను తొలగించనుండడంతో ఆ ప్రాంతాల్లో విద్యుత్ ప్రమాదాల ముప్పు తీరనుంది. ఆ బస్తీల్లో 33 కేవీ లైన్ కారణంగా పలు విద్యుత్ ప్రమాదాలు జరుగగా ప్రాణ, ఆస్తినష్టం జరిగింది. రూ. 9కోట్ల పనుల్లో భాగంగా 110 టవర్లు, 15 ట్రాన్స్‌ఫార్మర్లు, 9 కిలో మీటర్ల 11 కేవీ, 4 కిలో మీటర్ల 33 కేవీ , 8కిలో మీటర్లు ఎల్‌టీ మొత్తంగా 21 కిలో మీటర్ల కండక్టర్ బిగించారు.