నేడు ఖాతాల్లోకి పింఛన్ పైసలు!
ABN , Publish Date - Nov 26 , 2026 | 12:40 AM
‘చేయూత’ పథకం కింద కొత్తగా మంజూరైన పింఛన్ నగదు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నేడు జమకానుంది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న అచ్చంపేట వేదికగా పింఛన్‌కు సంబంధించి న నగదు బదిలీని సీఎం రేవత్‌రెడ్డి ప్రారంభించనున్నారు.
జిల్లాలో కొత్తగా 14,101మందికి ‘చేయూత’
అచ్చంపేట వేదికగా నగదు బదిలీని ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ చీరల పంపిణీ సైతం
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): ‘చేయూత’ పథకం కింద కొత్తగా మంజూరైన పింఛన్ నగదు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నేడు జమకానుంది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న అచ్చంపేట వేదికగా పింఛన్‌కు సంబంధించి న నగదు బదిలీని సీఎం రేవత్‌రెడ్డి ప్రారంభించనున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత కార్మికులు తదితర వర్గాలకు కొత్తగా పింఛన్ల ప్రభు త్వం మంజూరు చేసింది. ‘చేయూత’ పథకం జిల్లాలో కొత్తగా 14,101 మందికి పింఛన్లు మంజూరయ్యాయి. ఈనెల 20వతేదీ నుంచి కొత్తగా ఎంపికచేసిన లబ్ధిదారులకు మంజూరు ధ్రువపత్రాలను సైతం ఎమ్మెల్యేలు పంపిణీ చేశా రు.వీరందరికీ గురువారం అచ్చంపేటలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ఒకేసారి లబ్ధిదారుల ఖాతాల్లో నగదుజమను ప్రారంభించనున్నా రు. అందుకు పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.
జిల్లాలో 17,480 దరఖాస్తులు, 14,101 మంజూరు
పింఛన్ల మంజూరుకు కొత్తగా వచ్చిన దరఖాస్తుల్లో ప్రభుత్వం 360 డిగ్రీల వడపోత విధానం అమలుచేసింది. అర్హత ఉన్న వారికే పింఛన్లు అందించాల నే లక్ష్యంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా రాష్ట్రస్థాయిలో స్ర్కూట్నీ చేపట్టింది. ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు, 10 ఎకరాలకుపైగా వ్యవసాయ భూమిఉన్న రైతులు, ఐటీ చెల్లింపుదారులు కారు ఉన్నవారిని గుర్తించి, వారి దరఖాస్తులను తిరస్కరించారు. జిల్లాలో దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత కార్మికులు తదితర కేటగిరీల్లో పింఛన్ల కోసం 17,480 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వాటిని వివిధ స్థాయిల్లో పరిశీలించిన అనంతరం 14,101మందిని చేయూత పింఛన్ల కొత్త లబ్ధిదారులుగా ఎంపిక చేశారు.
జిల్లాలో 1.09లక్షల మందికి పింఛన్లు
జిల్లాలో ప్రస్తుతం చేయూత పథకంలో 94,953 మందికి ప్రతీ నెల పింఛన్ల ద్వారా ఆర్థిక భరోసా అందుతోంది. తాజాగా ప్రభుత్వం మరో 14,101మందికి కొత్తగా మంజూరు చేయడంతో జిల్లాలో మొత్తం పింఛన్ల లబ్ధిదారుల సంఖ్య 1,09,054కు చేరింది. ఇప్పటికే కొత్తగా పింఛన్‌దారులకు ప్రజాప్రతినిధులు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. వీరికి గురువారం సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెలకు సంబంధించిన పింఛన్ నగదు బదిలీని ప్రారంభించనుండటంతో ఆయా కుటుంబాలకు ఆర్థిక ఊరట కలగనుంది.
మహిళలకు ఇందిరమ్మ చీరలు
మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని సైతం సీఎం రేవంత్‌రెడ్డి గురువారం ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీని అచ్చంపేట సభలో లాంఛనంగా ప్రారంభించనుండటంతో జిల్లాలో సైతం పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 18 ఏళ్లు నిండి, తెల్లరేషన్‌కార్డులో పేరు ఉన్న ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీరను ప్రభుత్వం కానుకగా ఇవ్వనుంది. జిల్లాకు ఇప్పటికే ఇందిరమ్మ చీరలు చేరుకున్నాయి. వాటిని గ్రామీణ ప్రాంతాల్లోని 1,93,948మంది మహిళలకు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.