Share News

మైత్రీమార్గం

ABN , Publish Date - Oct 12 , 2026 | 12:36 AM

టాన్స్‌జెండర్ల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇన్నాళ్లు ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తితే ఆస్పత్రులకు వెళ్లేందుకు వెనుకడుగువేసే ట్రాన్స్‌జెండర్లు ఇప్పుడు ఎలాంటి బెరుకు లేకుండా వైద్యం చేయించుకునే వెసులుబాటు కల్పించింది.

మైత్రీమార్గం

ట్రాన్స్‌జెండర్ల కోసం మైత్రీ క్లీనిక్‌

ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ఏర్పాటు

వారంలో ఒక రోజు గురువారం ప్రత్యేక వైద్య పరీక్షలు

ఉపాధి మార్గాలనూ చూపుతున్న ప్రభుత్వం

జిల్లాలో వంద మంది కి పైగా ట్రాన్స్‌జెండర్లు

(ఆంధ్రజ్యోతి, సూర్యాపేట): టాన్స్‌జెండర్ల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇన్నాళ్లు ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తితే ఆస్పత్రులకు వెళ్లేందుకు వెనుకడుగువేసే ట్రాన్స్‌జెండర్లు ఇప్పుడు ఎలాంటి బెరుకు లేకుండా వైద్యం చేయించుకునే వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో మైత్రీ క్లీనిక్‌ ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ట్రాన్స్‌జెండర్లు సంఘంలో ఎలాంటి వివక్ష కు గురికాకుండా, వారి కాళ్లపై వారు నిలబడి బతికేందుకు ప్రత్యేక చర్యలు తీ సుకుంది. ఇందులో కట్టుమిషన్‌ శిక్షణతోపాటు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ విధులు నిర్వహించేందుకు నియమించింది. ఈ నిర్ణయాలతో జిల్లాలో ని సుమారు 100 మం దికిపైగా ట్రాన్స్‌జెండర్లకు లబ్ధికలగనుంది.

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి లో ట్రాన్స్‌జెండర్లకోసం ప్రత్యేకంగా మైత్రీ క్లీనిక్‌ ను ఏర్పాటుచేశారు. దాని ద్వారా ట్రాన్స్‌జెండర్లకు ప్రతీరోజు ప్రత్యేకంగా వైద్యసేవలందిస్తున్నా రు. అంతేకాకుండా ట్రాన్స్‌జెండర్లను హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ విధులు నిర్వహించేందుకు నియామకం చేశారు. వారికి ట్రాఫిక్‌ విధులు నిర్వహిం చే విషయంలో శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగ బాధ్యతలు అప్పగించారు. అయితే ఏడాది క్రితం సూర్యాపేట కలెక్టరేట్‌లో కలెక్టర్‌ తేజ్‌సనందలాల్‌పవార్‌ నిర్వహించిన మహిళా, శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమశాఖ సమావేశానికి ట్రా న్స్‌జెండర్లను ఆహ్వానించారు. ఆ సమావేశంలో ట్రాన్స్‌జెండర్లు తమకు ఏదైనా ఉపాధి అవకాశా లు కల్పించాలని కోరారు. భిక్షాటన చేయడం, ఇతర పనులు చేయడం ఇబ్బందిగా ఉందని, తమకంటూ సమాజంలో గౌరవం దక్కాలని, తా ము కూడా గౌరవప్రదంగా జీవించాలని, అందు కు ఏదైనా ఉపాధి మార్గం చూపించాలని కలెక్టర్‌ ను కోరారు. ట్రాన్స్‌జెండర్ల సమస్యలను తెలుసుకున్న కలెక్టర్‌ తేజ్‌సనందలాల్‌పవార్‌ వెంటనే జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆఽధ్వర్యంలోని జిల్లా మహిళా సాధికారిత కేంద్రం ద్వారా ట్రాన్స్‌జెండర్లకు కుట్టు శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు. అందుకు అవసరమైన నిధులను డీఎంఎ్‌ఫటీ నుంచి మంజూరు చేశారు. దీంతో జిల్లాకేంద్రంలోని కొత్త వ్యవసాయ మార్కెట్‌ సమీపంలో మహిళా సాధికారిత ఆధ్వర్యంలో ట్రాన్స్‌జెండర్లకు కుట్టు శిక్షణలో మెళకువలు నేర్పిస్తున్నారు. ఈశిక్షణ కొనసాగుతూనే ఉంది.

ప్రత్యేకంగా ఓ వార్డు..

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా మైత్రీ క్లీనిక్‌ను ఏర్పాటు చేసింది. ట్రాన్స్‌జెండర్ల వైద్య సేవల కోసం ఆస్పత్రిలో ఒక వార్డును ఏర్పాటు చేశారు. ట్రాన్స్‌జెండర్లు అనారోగ్యానికి గురైన సమయంలో ఆస్పత్రికి వస్తే వారికి ప్రత్యేకంగా కేటాయించిన వార్డులో వైద్యులు వైద్య సేవలందిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న ట్రా న్స్‌జెండర్లలో ఇప్పటి వరకు వందమంది వరకు ఆస్పత్రిలో వైద్యసేవలు పొందా రు. ప్రత్యేక వైద్య సేవలపై ట్రాన్స్‌జెండర్లకు అవగాహన లేకపోవడంతో వారు ఆస్పత్రిలో వైద్య సేవలు పొందేందుకు వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం.

వారంలో ఒక రోజు..

ట్రాన్స్‌జెండర్లకు వారంలో ఒక రోజు (గురువారం) ప్రభు త్వ జనరల్‌ ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో వారికి ప్రత్యేకంగా వైద్యసేవలందిస్తున్నారు. ఆ రోజు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వైద్యులు, సిబ్బంది అందుబాటు లో ఉండి ట్రాన్స్‌జెండర్లకు అవసరమైన వైద్య సేవలందిస్తున్నారు. వారం లో ఒక రోజు ప్రత్యేక వైద్యసేవలు కాకుండా ఏదైనా అత్యవసర వైద్య సేవలు అవసరమైతే రోజూ అత్యవసర విభాగంలో వారికి ప్రత్యేకంగా వార్డులో వైద్య సేవలందిస్తున్నారు. ట్రాన్స్‌జెండర్ల వైద్య సేవలకోసం ఆస్పత్రిలో ప్రత్యేకంగా పలు విభాగాలకు చెందిన వైద్యులు, సిబ్బందిని కేటాయించారు. వారంలో ఒక రోజు ప్రత్యేకంగా ట్రాన్స్‌జెండర్లకు వైద్య సేవలందించే విషయంలో ఒక జనరల్‌ మెడిసిన్‌, గైనకాలజిస్టు, మానసిక వైద్యుడు, చర్మవ్యాధుల వైద్యుడితో పాటు పలువురు సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. వైద్య సేవలకోసం ఆస్పత్రికి వచ్చిన ట్రాన్స్‌జెండర్లతో ఎలా వ్యవహరించాలో, వారితో మాట్లాడే విధానంపై సంబంధిత వైద్యు లు, సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. దీంతో ట్రాన్స్‌జెండర్లకు తరచుగా వచ్చే లైంగిక సంక్రమిత వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారు.

ప్రత్యేక వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి

ట్రాన్స్‌జెండర్లకోసం ప్రభుత్వం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి. ట్రాన్స్‌జెండర్లు వారంలో ఒక రోజు గురువారం ఆస్పత్రిలో అందించే ప్రత్యేక వైద్య పరీక్షలను చేయించుకోవాలి. అన్ని విభాగాల వైద్యులు ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నారు. ప్రత్యేక వైద్యసేవల విషయంలో ట్రాన్స్‌జెండర్లకు అవగాహన కల్పించాల్సి ఉంది. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా మెరుగైన వైద్యం పొందాలి.

- డాక్టర్‌ పోరిక శ్రవణ్‌కుమార్‌, ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌, సూర్యాపేట.

Updated Date - Oct 12 , 2026 | 12:36 AM