Share News

గేదెను ఢీకొట్టిన పల్నాడు ఎక్స్‌ప్రెస్‌

ABN , Publish Date - Apr 10 , 2026 | 12:33 AM

నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలో పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ రైలు గేదెను ఢీకొట్టింది. అర కిలోమీటరు దూరం ప్రయాణించినా గేదె కళేబరం ఇంజన కిందనే ఉండిపోవటంతో రైలును నిలిపివేసి కళేబరాన్ని తొలగించారు.

గేదెను ఢీకొట్టిన పల్నాడు ఎక్స్‌ప్రెస్‌
తిప్పలమ్మగూడెం వద్ద ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇంజన కింద గేదె కళేబరం

కళేబరాన్ని తీసేందుకు అరగంట నిలిచిన రైళ్ల రాకపోకలు

తిప్పర్తి, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలో పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ రైలు గేదెను ఢీకొట్టింది. అర కిలోమీటరు దూరం ప్రయాణించినా గేదె కళేబరం ఇంజన కిందనే ఉండిపోవటంతో రైలును నిలిపివేసి కళేబరాన్ని తొలగించారు. దీంతో సుమారు అరగంట పాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంటూరు నుంచి వికారాబాద్‌కు వెళ్తున్న(12747) పల్నాడు-సింహాద్రి రైలు నల్లగొండ జిల్లా తిప్పర్తి రైల్వేస్టేషన దాటాక కిలోమీటరు దూరంలో గురువారం ఉదయం 8:30గంటలకు అడ్డుగా వచ్చిన గేదెను బలంగా ఢీకొట్టింది. అర కిలోమీటరు దూరం ప్రయాణించినా గేదె కళేబరం ఇంజన కిందనే ఉండిపోవటంతో తిప్పలమ్మగూడెం గ్రామం సమీపంలో రైలును నిలిపివేశారు. అనంతరం తిప్పర్తి రైల్వేస్టేషన సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో గ్యాంగ్‌మెన వచ్చి కళేబరాన్ని తొలగించారు. ఇందుకు అరగంట సమయం తీసుకోవడంతో రైళ్ల రాకపోకలు నిలిచాయి. అదే సమయంలో గుంటూరు నుంచి వస్తున్న శబరి ఎక్స్‌ప్రె్‌సను తిప్పర్తి రైల్వేస్టేషనలో 10 నిమిషాలు నిలిపివేశారు. ప్రమాదం కారణంగా అరగంట వరకు రైలు నిలిచిపోవడంతో ప్రమాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ప్రమాదానికి కారణమైన గేదె యజమాని వివరాలు తెలుసుకుని కేసు నమోదుచేసి చర్యలు తీసుకోనున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

Updated Date - Apr 10 , 2026 | 12:33 AM