Share News

మిల్లులకు పోటెత్తుతున్న ధాన్యం

ABN , Publish Date - Oct 31 , 2026 | 12:36 AM

ఎల్‌నినో ప్రభావంతో సాగు కష్టాలు ఎదుర్కొన్న రైతులకు, ధాన్యం విక్రయాల్లో గిట్టుబాటు ధర లభిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరికోతలు ముమ్మరమవడంతో మిల్‌పాయింట్లకు ధాన్యం తాకిడి పెరిగింది.

మిల్లులకు పోటెత్తుతున్న ధాన్యం

మిల్లు వద్ద సన్నరకాలకు రూ.3,900 వరకు ధర

ప్రతీ రోజు 10వేల మెట్రిక్‌టన్నులకుపైగా రాక

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా వరి కోతలు

కొనుగోలు కేంద్రాల వివరాలన్నీ ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌

ఈ ప్రక్రియ పూర్తయితే పూర్తి పారదర్శకంగా కొనుగోళ్లు

(ఆంధ్రజ్యోతిప్రతినిధి, నల్లగొండ): ఎల్‌నినో ప్రభావంతో సాగు కష్టాలు ఎదుర్కొన్న రైతులకు, ధాన్యం విక్రయాల్లో గిట్టుబాటు ధర లభిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరికోతలు ముమ్మరమవడంతో మిల్‌పాయింట్లకు ధాన్యం తాకిడి పెరిగింది. యా సంగిలో వరి దిగుబడులు ఉండవని తేలిపోవడంతో ఈ సీజన్‌లోనే వీలైనంత ధాన్యం కొనుగోలుచేసి నిల్వ చేసుకునేందుకు మిల్లర్లు సన్నాహాలు చేస్తుండటం తో ధాన్యానికి ధర సైతం పెరిగింది.

తేమ, తాలు వంటి సాకులు లేకుండా వచ్చిన ధాన్యం వచ్చినట్లే మిల్లర్లు కొనుగోలు చేస్తున్నారు. సన్నధాన్యానికి క్వింటాకు రూ.3,800 నుంచి రూ.3,900 వరకు ధర చెల్లిస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర, బోనస్‌ కంటే మిల్లుల వద్ద అధిక ధర వస్తుండడంతో రైతులు నేరుగా మిల్లులు పాయింట్ల వద్ద విక్రయిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఈ దఫా ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత, సులభతర నిర్వహణ కోసం అన్ని కేంద్రాలను అక్కడి సదుపాయాలు, వనరులు, రైతుల వివరాలు, మిల్లుల వివరాలన్నింటినీ ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేయిస్తోంది. కేంద్రాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిచేసి అక్కడ కూడా ఽధాన్యం కొనుగోళ్లు పూర్తి పారదర్శకంగా కొనసాగేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

మిల్లులకు భారీగా

వానాకాలం వరి కోతలు ముమ్మరమవడం, వచ్చే యాసంగిలో వరి సాగుచేయవద్దని ప్రభుత్వం స్పష్టం చేయడం తో ఉమ్మడి జిల్లాలో రైస్‌మిల్లర్లు ధాన్యం ధరలు పెంచి కొనుగోలు చేస్తున్నారు. ధాన్యానికి గ్రేడ్‌-1 రకానికి రూ.2,461, కామన్‌ వెరైటీలకు రూ.2,44 1 మద్దతు ధర ఉండగా, సన్నరకాలను కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే ప్రభుత్వం అదనంగా మరో రూ.500 బోనస్‌ ఇస్తోంది. సన్న రకాలు వానాకాలంలో అత్యధికంగా సాగవుతుండగా, మిల్లర్లు పచ్చిధాన్యా న్ని సైతం కొనుగో లు చేస్తుండడంతో పాటు క్వింటాకు రూ.3,800 నుంచి రూ.3,900 గరిష్ఠంగా రూ.4వేల వరకు చెల్లిస్తున్నారు. వారం క్రితం గరిష్ఠంగా రూ.4,500 చెల్లిస్తున్నా, ప్రస్తుతం పచ్చిధాన్యం వస్తుండడంతో ధర కొంత తగ్గించినట్టు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరికోతలు ముమ్మరమవడంతో పాటు, జనగామ, హన్మకొం డ ప్రాంతాల నుంచి కూడా మిర్యాలగూ డ రైస్‌మిల్లులకు ధాన్యం వస్తోంది. ప్రతి రోజూ దాదాపు 1,000కి పైగా ట్రాక్టర్లలో సుమారు 10వేల మెట్రిక్‌టన్నుల మేర ధాన్యం మిల్లులకు వస్తోంది.

కొనుగోళ్లలో పారదర్శకత కోసం ఈ-రిజిస్ట్రేషన్‌...

ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు, పూర్తి పారదర్శకం గా నిర్వహించేందుకు కలెక్టర్‌ సూచనలతో సివిల్‌సప్లయి్‌సశాఖ, సివిల్‌సప్లయిస్‌ కార్పొరేషన్‌ అధికారులు జిల్లాలోని కొనుగోలు కేంద్రాలన్నింటినీ ఆన్‌లైన్‌లో ఈ-రిజిస్ట్రేషన్‌ చేయిస్తున్నారు. ప్రతీ కేంద్రానికి సంబంధించి సుమారు 16 రకాల వివరాలను అందులో పొందుపరుస్తున్నారు. కేంద్రం ఏర్పాటుచేసే లొకేషన్‌ మ్యాప్‌, టెంట్ల వివరా లు, తాగునీరు, దాని పరిధిలోని రైతుల వివరాలు, ధాన్యం ఉత్పత్తి అంచనా, కేంద్రాని కి వచ్చే అంచనా, విద్యుత్‌, నెట్‌ సదుపాయం, కాంటాలు, ప్యాడీ క్లీనర్లు, తేమ యం త్రాలు, సిబ్బంది వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. దీనికి సమాంతరంగా ఇటు డీఎ్‌సవో కార్యాలయ లాగిన్‌ ద్వారా జిల్లాలో ధాన్యం కేటాయించే మిల్లులు, ప్యా డీ సెంటర్లు, ఏ సెంటర్‌కు ఏ మిల్లును కేటాయించే అంశాలను పొందుపరుస్తారు.. సంబంధిత కేంద్రానికి సమీపంలో ఉన్న మిల్లులు, బఫర్‌ గోదాముల వివరాలను కూడా ఆన్‌లైన్‌లో పొందుపరచడం ద్వారా రైతులకు పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. రైతులు తెచ్చే ధాన్యం ఎంత, ఏ మిల్లులకు పంపాలనే అంశం కూడా ట్యాబ్‌లో రైతు ఐడీకి వెంటనే సమాచారం అందుతుంది. దాని ప్రకారం సంబంధిత లారీని ఆ మిల్లుకే పంపాల్సి ఉంటుంది. అంతేగాక ధాన్యం తరలించే లారీలన్నింటినీ తప్పనిసరిగా జీపీఎస్‌ అనుసంధానం చేయాల్సి ఉంటుంది. జీపీఎస్‌ ఉన్న లారీలకు మాత్రమే ట్రాన్సిట్‌ పర్మిట్లు ఆన్‌లైన్‌ ద్వారా వస్తుండడంతో లారీలన్నింటికీ కాంట్రాక్టర్లు జీపీఎస్‌ అనుసంధానం చేస్తున్నారు. ఈ-రిజిస్ట్రేషన్‌ అమలులోకి రానుండడంతో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో పూర్తి పారదర్శకత రానుందని, దీంతో ధాన్యం కాంటాల, రవాణా కోసం రోజుల తరబడి వేచి ఉండే ఇబ్బందులకు చెక్‌పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రభుత్వ కేంద్రాలకు ప్రారంభమవని తాకిడి

జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో 286 ధా న్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 5లక్షల మెట్రిక్‌టన్నుల వరకు కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ధారించారు. నల్లగొండ ఆర్జాలబావిలో ఈనెల 26న కలెక్టర్‌ చంద్రశేఖర్‌ తొలిధాన్యం కొనుగోలుకేంద్రాన్ని ప్రారంభించారు. దీంతో పాటు మరో ఆరు కేంద్రాలు ప్రారంభమైనా ఇంకా కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. ఈ సారి కేంద్రాలన్నింటినీ ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని నిర్ణయించడంతో ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు సన్నధాన్యమంతా మిల్‌పాయింట్లకు వెళ్తుండటంతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం ఒత్తిడిలేకుండా పోయింది. వారం రోజుల్లో కొనుగోలు కేంద్రాల ఈ-రిజిస్ట్రేషన్‌ పూర్తిచేసి, అన్ని కేంద్రాల్లో కొనుగోళ్లు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని జిల్లా సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ డీఎం రాంపతినాయక్‌, జిల్లా సివిల్‌ సప్లయిస్‌ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు.

Updated Date - Oct 31 , 2026 | 12:36 AM