ఇథనాల్ పరిశ్రమపై వ్యతిరేకత
ABN , Publish Date - Nov 19 , 2026 | 12:30 AM
దామరచర్ల మండలం వీర్లపాలెం లో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుపై ఈ నెల 20న నిర్వహించే ప్రజాభిప్రా య సేకరణను నిలిపివేయాలనే డిమాం డ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి రూపొందించిన పర్యావరణ ప్రభావ అంచనా నివేదికలో వాస్తవాలు దాచిపెట్టారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
వీర్లపాలెంలో ప్రజాభిప్రాయసేకరణనిలిపివేయాలని హైకోర్టులో రిట్
దాఖలు చేసిన గ్రామస్థులు
నేటి విచారణపై అందరి దృష్టి
ప్రజాభిప్రాయ సేకరణకు యాజమాన్యం సన్నాహాలు
వ్యతిరేకించే స్థానికులపై పోలీసుల ఒత్తిడి..
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ): దామరచర్ల మండలం వీర్లపాలెం లో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుపై ఈ నెల 20న నిర్వహించే ప్రజాభిప్రా య సేకరణను నిలిపివేయాలనే డిమాం డ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి రూపొందించిన పర్యావరణ ప్రభావ అంచనా నివేదికలో వాస్తవాలు దాచిపెట్టారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
స్థానిక ప్రభావిత ఆవాసాలు, జనజీవితం, జంతుజాలాలు, నీటివనరులు, అటవీ సంపద, పర్యావరణంపై చూపే ప్రభావాలను అంచనా నివేదికలో శాస్త్రీయవిధానాల్లో పేర్కొనలేదని పలువురు విమర్శిస్తున్నారు. వీలైనంతమేర దాచిపెట్టే ప్రయత్నాలు చేశారని ఆరోపిస్తున్నారు. పరిశ్రమ ఏర్పాటుతో జరిగే నష్టాలను వివరిస్తూ సైంటిస్ట్స్ ఫర్ పీపుల్, మానవ హక్కులవేదిక, తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మేధావులు, సామాజికవేత్తలు వీర్లపాలెం, పరిసర గిరిజన తండాల్లో పర్యటిస్తూ చైతన్యం చేస్తున్నారు. పరిశ్రమ ఏర్పాటుతో ఎదురయ్యే పర్యావరణ, కాలుష్య ప్రభావాలు, తద్వారా జనజీవనానికి జరిగే నష్టాన్ని వివరిస్తున్నారు. తాజాగా ప్రజాభిప్రాయ సేకరణను నిలిపివేయాలని కోరుతూ బుధవారం వీర్లపాలెం గ్రామస్థులు హైకోర్టులో రిట్‌పిటిషన్ దాఖలు చేశారు.
నేడు హైకోర్టులో విచారణ
వీర్లపాలెంలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు ఈనెల 20వ తేదీన నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని కోరు తూ గ్రామస్థులు బుధవారం హైకోర్టు లో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. గ్రామానికి చెందిన రమావత్ వినోద్‌నాయక్, నేనావత్ సిపాయి, కట్టెబోయిన నాగరాజు, రమావత్ గోవిందు, గుంజ రమేష్, ధీరావత్ శ్రీను నాయక్, నక్కశ్రీనివాస్ ఈ పిటిషన్ దాఖలుచేశారు. పిటిషన్‌ను స్వీకరించి న హైకోర్టు ప్రధాన బెంచ్ గురువారం విచారణ నిర్వహిస్తామని పేర్కొంది. గురువారం విచారణ తర్వాత కోర్టు ఇచ్చే ఆదేశాల ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందా? లేదా? అనే అంశం తేలనుంది.
పోలీసుల హడావిడి
పరిశ్రమ ఏర్పాటుపై స్థానికుల నుంచి వ్యతిరేకత వస్తుండడంతో పాటు, పలు సామాజిక, స్వచ్ఛంద, పర్యావరణ, మానవ హక్కుల సంస్థలు ఈ పరిశ్రమను వ్యతిరేకిస్తున్నాయి. ప్రజాభిప్రాయ సేకరణకు పరిశ్రమ యాజమాన్యం ఏర్పాట్లు చేస్తుండగా, మరోవైపు పోలీసుల రంగ ప్రవేశంపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పరిశ్రమను వ్యతిరేకిస్తూ పలు వేదికలపై మాట్లాడుతున్న గ్రామస్థుల ఇళ్ల వద్దకు పోలీసులు బుధవారం వెళ్లి ఆరా తీయడంతో పాటు, విచారణకు రావాలని కోరడంపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసు బలంతో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని చూస్తే సహించేదిలేదని, తాము ప్రజాస్వామ్యబద్ధంగా, మేధావులు, సామాజికవేత్తల అభిప్రాయాల ప్రకారం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నామని స్థానికులు పేర్కొంటున్నారు.