Share News

ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Jul 04 , 2026 | 12:04 AM

ఆర్టీసీ బస్సులో ప్రయాణించే విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, మహిళలు, వృద్ధులు ఆర్టీసీ సేవాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు.

ఆర్టీసీ సేవలను  సద్వినియోగం చేసుకోవాలి
బస్సు నడుపుతున్న బీర్ల అయిలయ్య

ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య

ఆత్మకూరు(ఎం), జూలై 3 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సులో ప్రయాణించే విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, మహిళలు, వృద్ధులు ఆర్టీసీ సేవాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. మండలంలోని కొరటికల్‌ గ్రామానికి శుక్రవారం బస్సు సర్వీసును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ స్వయంగా బస్సు నడిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ఎ న్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కొరటికల్‌ నుంచి ఉప్పల్‌ వరకు బస్సు సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. నష్టాల్లోఉన్న ఆర్టీసీని ప్రజా పాలనలో సమర్థవంతమైన నిర్ణయాలతో క్రమంగా లాభాల బాట పట్టించిన ఘనత కాంగ్రె్‌సకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత అర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేయడం ద్వారా లక్షలాది మంది మహిళలకు ఆర్థిక భారం తగ్గిందని అన్నారు. ప్రజలకకు ఇచ్చిన ప్రతి హామిని దశలవారీగా అమలు చేస్తూ ఆలేరు నియోజకవర్గన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఆధికారులు, కాంగ్రెస్‌ నాయకులు, కా ర్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Jul 04 , 2026 | 12:04 AM