భక్తిభావాన్ని పెంపొందించాలి
ABN , Publish Date - Aug 14 , 2026 | 12:09 AM
ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించాలని ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు.
అడ్డగూడూరు, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించాలని ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. గురువారం అడ్డగూడూరు మండలంలోని తన స్వగ్రామైన ధర్మారంలో ముత్యాలమ్మ, మారెమ్మ, మహంకాలమ్మ దేవతల విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవార్ల ఆశీస్సులతో గ్రామంలో పాడి పంటలు సమృద్ధి పండాలని ఆకాక్షించారు. గ్రామ, ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం తరపున సహకరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే సామేలు బోనం ఎత్తుకుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ మేకల మేరి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు లింగాల నర్సిరెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు నిమ్మనగోటి జోజి, నాయకులు పాశం సత్యనారాయణ, బాలెంల విద్యసాగర్, వళ్లంభట్ల రవీందర్, నరేష్ పాల్గొన్నారు.