ఉద్యోగంలో ఒకరు.. విధుల్లో మరొకరు
ABN , Publish Date - Mar 04 , 2026 | 12:23 AM
విద్యుతశాఖలో పేరుకు ఒకరు, విధులకు మరొక రు అన్నట్లుగా కొందరు సిబ్బంది తీరు కనిపిస్తోంది. అంతరాయం లేకుండా విద్యుత అం దించాలన్న ప్రభుత్వం లక్ష్యం కొందరు సిబ్బందికి ఆసరాగా మారింది. కొందరు లైనమన్లు తమ స్థానంలో కనీస వేతనానికి యువకులను నియమించుకుని వారితో పనులు చక్కబెట్టిస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి-ఆత్మకూరు(ఎస్)
విద్యుతశాఖలో పేరుకు ఒకరు, విధులకు మరొక రు అన్నట్లుగా కొందరు సిబ్బంది తీరు కనిపిస్తోంది. అంతరాయం లేకుండా విద్యుత అం దించాలన్న ప్రభుత్వం లక్ష్యం కొందరు సిబ్బందికి ఆసరాగా మారింది. కొందరు లైనమన్లు తమ స్థానంలో కనీస వేతనానికి యువకులను నియమించుకుని వారితో పనులు చక్కబెట్టిస్తున్నారు. విద్యుత స్తంభం ఎక్కాలన్నా, తీగలను సరి చేయాలన్నా, ఫ్యూజ్‌లు వేయాలన్నా, రైతుల మోటార్లు బా గు చేయాలన్నా సిబ్బంది బదులుగా స్థానికంగా నియమించుకున్న యువకులే వెళ్తున్నారు. లైనమన, జూనియర్ లైనమన విధులను వారే చక్కబెట్టేస్తున్నారు. కొన్నేళ్లుగా ఈ తంతు సాగుతున్నా ఉన్నతాధికారులు ఎవ రూ స్పందించడంలేదు. ఈ యువకులు పనులు చేసి పెడుతుండటంతో అసలు విద్యుత అధికారులెవరో ప్రజా ప్రతినిధులకు సైతం తెలియని పరిస్థితి నెలకొంది. నెలలో 20 రోజులకు పైగా ఏఈలు హాజరవుతున్నా కిందిస్థాయి అధికారులు సిబ్బంది మాత్రం నెలలు తరబడి విధులను నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఫిర్యాదు చేసినా..
మండలంలోని బొప్పారం లైనమన విధులకు హాజరుకాకుండా మరో యువకుడితో పనులు చేయిస్తున్నాడు. ఇదే విషయమై రైతులు, స్థానికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేద న్న విమర్శలు ఉన్నాయి. ఏడాది కిందట చివ్వెంల మండలం చందుపట్ల నుంచి బదిలీపై వచ్చిన ఆయన వారం రోజుల పాటే విధుల్లో ఉన్నాడని అనంతరం మిడ్తనపల్లికి చెందిన ఓ వ్యక్తిని నియమించుకుని అతడి తో పనులు చేయిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఆ యువకుడికి రూ.15 వేల వేతనం ఇస్తూ ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్థానికు లు ఆరోపిస్తున్నారు. ఇదేవిధంగా మండలంలోని చాలా గ్రామాల్లో విద్యుతసిబ్బంది స్థానిక యువకులతో పనులు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే భవిష్యతలో ఉద్యోగం రెగ్యులర్ అవుతుందని ఆశపెట్టి వారితో వెట్టిచాకిరీ చేయిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
యువకుల చేతివాటం...
గ్రామాల్లో విద్యుత సిబ్బంది నియమించుకున్న యువకులు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఏ చిన్న సమస్య పరిష్కరించాలన్నా డబ్బులు ఇవ్వనిదే చేయడంలేదని రైతులు, గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. లైనమన ఇచ్చే కనీస వేతనం ఎలా సరిపోతుందంటూ వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు లేవంటున్నారు. దీంతో వేలకు వేలు డబ్బులు ఇచ్చి పనులు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు.
విధులకు రాని సిబ్బంది ఉన్నతాధికారులకు మామూళ్లు ముట్టచెబుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో లైనమన కొన్ని గ్రామాల్లో ఇద్దరిని, ముగ్గురిని ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది.
ప్రమాదంలో యువకుడు మృతి
మండలంలో విద్యుత లైనమన విధులు చూసుకుంటున్న నిరుద్యోగులు ప్రమాదాల బారిన పడుతున్నారు. పాతర్లపహాడ్ గ్రా మానికి చెందిన లైనమన కొత్తతండాకు చెందిన గుగులోతు శ్రీనును తాత్కాలికంగా నియమించుకున్నాడు. పాతర్లపహాడ్ గ్రామంలో కాకి సత్తిరెడ్డి పొలం వద్ద విద్యుత సమస్యను పరిష్కరిస్తూ ప్రమాదానికి గురయ్యాడు. మూడు నెలలు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఇటీవల మృతి చెందాడు. శ్రీనుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీను కుటుంబానికి లైనమన చికిత్స సమయంలో కొంత డబ్బులు ఇచ్చి పట్టించుకోలేదు. శ్రీను మృతదేహంతో రైతు సత్తిరెడ్డి ఇంటి ముందు గిరిజనులు, బంధువులు ఆందోళన చేపట్టడంతో పోలీసులు కలగజేసుకొని రైతు నుంచి కొంత ఆర్థికసాయం అందించారు.
నివేదిక పంపుతాం
లైనమన్లు కొందరు ప్రైవేట్ వ్యక్తులను గ్రామాల్లో తాత్కాలికంగా నియమించుకోవడంపై విచారణ చేస్తాం. నివేదికను ఉన్నతాధికారులకు పంపుతాం. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.
-రాజేష్, విద్యుత ఏఈ