Share News

వర్షాలు కురవాలి వానదేవుడా..

ABN , Publish Date - Jul 14 , 2026 | 12:21 AM

యాదాద్రిభువనగిరి జిల్లాలో వర్షాల కోసం గ్రామీణులు పూజలు చేస్తున్నారు. జలబిందెలతో అభిషేకాలు చేస్తున్నారు. చుట్టుకాముడు ఆడుతున్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం సర్వేపల్లిలో మహిళలు శివలింగాలకు జలాభిషేకాలు చేసి, చుట్టుకాముడు ఆడుతూ వరుణదేవున్ని ప్రార్థించారు.

వర్షాలు కురవాలి వానదేవుడా..
ఆత్మకూరు(ఎం) మండలం సర్వేపల్లిలో చుట్టుకాముడు ఆడుతున్న మహిళలు

యాదాద్రిభువనగిరి జిల్లాలో వర్షాల కోసం గ్రామీణులు పూజలు చేస్తున్నారు. జలబిందెలతో అభిషేకాలు చేస్తున్నారు. చుట్టుకాముడు ఆడుతున్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం సర్వేపల్లిలో మహిళలు శివలింగాలకు జలాభిషేకాలు చేసి, చుట్టుకాముడు ఆడుతూ వరుణదేవున్ని ప్రార్థించారు. ఆత్మకూరు(ఎం)లో రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శివలింగం మునిగేవరకు మహిళలు బిందెలతో జలాభిషేకాలు చేసి , పాలకాయలు కొట్టి ప్రార్థనలు చేశారు.

ఫ మోత్కూరు పట్టణ పరిధి ఆరెగూడెంలో మహిళలు బిందెల్లో నీళ్లు నింపి, వేపమండలు, పసుపుకుంకుమలతో బిందెలను అలకరించి చుట్టుకాముడు ఆడారు. ఆ నీటితో బొడ్రాయికి జలాభిషేకం చేశారు.

ఫ రాజాపేట మండలం మొల్లగూడెం గ్రామచావడిలో నీటి వర్షాల కోసం బిందెలను పెట్టి మహిళలు బతుకమ్మ ఆడారు. గ్రామ దేవతలకు జలాభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ రెడ్డబోయిన కవిత, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2026 | 12:21 AM