అంగన్‌వాడీల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ABN , Publish Date - Jul 22 , 2026 | 12:23 AM
మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల టీచర్లు, సహాయకుల పోస్టుల భర్తీ ప్రక్రియకు జిల్లా సంక్షేమ, మహిళ, శిశు, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమశాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
జిల్లాలో 79 పోస్టులు
ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు నెలాఖరు వరకు గడువు
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి) : మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల టీచర్లు, సహాయకుల పోస్టుల భర్తీ ప్రక్రియకు జిల్లా సంక్షేమ, మహిళ, శిశు, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమశాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాలోని నాలుగు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 55 అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు, 24 కేంద్రాల్లో సహాయకుల పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది.
అంగన్‌వాడీ కేంద్రాల టీచర్లు, సహాయకుల పోస్టుల కోసం అర్హత, ఆసక్తి ఉన్న మహిళలు మంగళవారం నుంచి ఈ నెల 31వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉం టుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు అంగన్‌వాడీ కేంద్రం ఉన్న ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో ఆగస్టు 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలన నిమిత్తం సమర్పించి, అటెస్టెడ్ జీరాక్స్ కాపీలను అందజేయాల్సి ఉంటుంది.
79 పోస్టుల భర్తీ
జిల్లాలో అంగన్‌వాడీ టీచర్లు, సహాయకులకు సంబంధించి 79 పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. వీటిలో 55 టీచరు పోస్టులు కాగా, 24 సహాయకుల పోస్టులు ఉన్నాయి. జిల్లాలోని నాలుగు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో వీటిని భర్తీ చేయనున్నారు. ఆలేరు ప్రాజెక్టులో తొమ్మిది టీ చర్ పోస్టులు, ఏడు సహాయకుల పోస్టులు, భువనగిరి ప్రాజెక్టులో మూడు టీచ ర్, 13 సహాయకులు, మోత్కూరు ప్రాజెక్టులో 31 టీచర్ పోస్టులు, రామన్నపేట ప్రాజెక్టులో 12 టీచర్ పోస్టులు, నాలుగు సహాయకుల పోస్టులు భర్తీ చేయనున్నారు.
ఇంటర్ ఉత్తీర్ణత తప్పనిసరి
అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు, సహాయకుల పోస్టులకు ఇంటర్ విద్యార్హత తప్పనిసరి. సహాయకురాలి పోస్టుకు ఇంటర్ అభ్యర్థులు గ్రామంలో లేకపోతే పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలిస్తారు. 18 ఏళ్ల వయస్సు నిండి, 35 ఏళ్ల లోపు ఉన్న మహిళలు మాత్రమే అర్హులు. అంగన్‌వాడీ కేంద్రాల పోస్టులకు ఆయా గ్రామ నివాసులు మాత్రమే అర్హులు. గ్రామీణ ప్రాంత కేంద్రాలకు గ్రామపంచాయతీలో నివాసం ఉండాలి. పట్టణ ప్రాంతాల్లోని కేంద్రాలకు సంబంధించి వార్డుకు చెందిన వారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన పోస్టులకు అదే హ్యాబిటేషన్‌లో ఆవాసులై ఉండాలి. తహసీల్దార్ నుంచి స్థానిక ధ్రువీకరణ తప్పనిసరిగా జత చేయాలి. పోస్టుల వారీగా రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం కులం, వర్గం అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. అదే విధంగా ధ్రువీకరణ పత్రాల్లో పేర్లలో మార్పులు ఉంటే కోర్టు ఉత్తర్వులు, గెజిట్ ఉత్తర్వులు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు వివరించారు.
జిల్లాలో అంగన్‌వాడీ పోస్టుల ఖాళీలు ఇలా..
ప్రాజెక్టు టీచర్ సహా మొత్తం
పోస్టులు యకులు
ఆలేరు 9 7 16
భువనగిరి 3 13 16
మోత్కూరు 31 - 31
రామన్నపేట 12 4 16
మొత్తం 55 24 79