గృహాలు ఖాళీ చేయాలని నోటీసులు
ABN , Publish Date - May 26 , 2026 | 11:42 PM
నాగార్జునసాగర్, మే 26(ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిఽధిలో క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న నివాసితులను ఇళ్లు ఖాళీ చేయాలంటూ ఎన్‌ఎస్పీ అధికారులు సోమవారం నోటీసులు జారీ చేశారు.
నాగార్జునసాగర్, మే 26(ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిఽధిలో క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న నివాసితులను ఇళ్లు ఖాళీ చేయాలంటూ ఎన్‌ఎస్పీ అధికారులు సోమవారం నోటీసులు జారీ చేశారు. దీంతో సాగర్ బీఆర్‌ఎస్ నాయకులు ఎస్‌ఈ కార్యాలయం ఎదుట మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఈఈ సీతారాం నాయక్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ రమేష్‌జీ మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకోని ఆరు దశాబ్దాలుగా ఎన్‌ఎస్పీ క్వార్టర్స్‌ల్లో నివాసం ఉంటున్న నివాసితులకు ఇళ్లు ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేయడం ఎంత వరకు సబబు అన్నారు. మునిసిపల్ ఎన్నికల సమయంలో మిర్యాల గూడలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి సాగర్‌లో నివాస గృహాలను జీవో 58,59 ప్రకారం క్రమ బద్ధ్దీకరిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఎన్నికలు అయిపోగానే ఆ హామీని తుంగలో తొక్కారన్నారు. స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించి నివాసితులకు తగిన న్యాయం చేయాలన్నారు. లేనిపక్షంలో బీఆర్‌ఎస్ ఆధ్వ ర్యంలో ప్రజల తరుపున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నకిరేకంటి సైదులు, గని, చంద్రమౌళి, విజయ్, కోడ విజయ్, విక్రం, నరేష్, నజీర్, షరీఫ్, రఫి, శేఖరాచారి, లక్ష్మణ్ నాయక్, కోదండ, రవి తదితరులు పాల్గొన్నారు.