Share News

భరోసా దక్కదు భయం తగ్గదు

ABN , Publish Date - Mar 07 , 2026 | 12:42 AM

ప్రజాభరోసాతో పేరుతో ఎస్పీ కొత్తపల్లి నర్సింహ పోలీసులను ప్రజల్లోకి తీసుకెళ్లి, ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రయత్నిస్తున్నారు. కానీ సూర్యాపేటరూరల్‌ పోలీ్‌సస్టేషన సిబ్బంది ఆయన లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు.

భరోసా దక్కదు  భయం తగ్గదు

రూరల్‌ పోలీస్‌స్టేషనలో ఇదీ పరిస్థితి

ఎవరికీ చెప్పుకోలేని ఫిర్యాదుదారులు

ప్రజాభరోసాతో పేరుతో ఎస్పీ కొత్తపల్లి నర్సింహ పోలీసులను ప్రజల్లోకి తీసుకెళ్లి, ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రయత్నిస్తున్నారు. కానీ సూర్యాపేటరూరల్‌ పోలీ్‌సస్టేషన సిబ్బంది ఆయన లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు. పోలీ్‌సస్టేషన మెట్లు ఎక్కాలంటే ఫిర్యాదుదారులు జంకుతున్నారు. స్టేషనలో ఏ ఫిర్యాదు చేయాలన్నా ముందుగా స్టేషన సిబ్బందిని ప్రసన్నం చేసుకోవాలి. ఆ తర్వాత ఫిర్యాదుదారుడి బాధ వింటారు. లేదంటే అంతే సం గతి అని ప్రజలు వాపోతున్నారు. ప్రసన్నం చేయని వారిని భయాందోళనకు గురిచేస్తున్నారు. ధైర్యం ఇవ్వాల్సిన పోలీసులు సెక్షన్లు గుర్తుచేస్తూ దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తున్నాయి. నాయకుల మాటలకే విలువిస్తూ సామాన్యులను చిన్నచూపు చూస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

- (ఆంధ్రజ్యోతి-సూర్యాపేటరూరల్‌)

సూర్యాపేట రూరల్‌ పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్టేషనకు వెళ్లిన వారు పోలీస్‌ సిబ్బందితో మరిన్ని బాధలకు గురికావాల్సి వస్తోందని వాపోతున్నారు. విధుల్లో న్యాయం చూపాల్సిన వారు డబ్బులివ్వకుంటే చులకనగా చూస్తూ ఇబ్బందులు పెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నారు. ఇటీవల ఎస్పీ నర్సింహ పోలీ్‌సస్టేషనను తనిఖీ చేసిన సందర్భంలోనూ ఇక్కడిఅధికారుల తీరు బాగోలేదని, వెంటనే మార్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయినా అధికారులు, సిబ్బంది తీరు మారలేదంటున్నారు. ఎస్పీ ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఇటీవల బాలెంలకు చెందిన ఓ రైతు భూమి విషయంలో పెద్దమనుషులతో పాటు పోలీసులు కూడా పెద్ద మొత్తం లో డబ్బులు తీసుకుని పంచాయితీ చేయకుండా పెండింగ్‌లో పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు సమాచారం.

జనగాం రోడ్డులో ఇటీవల జరిగిన ప్రమాద విషయంలో సైతం లావాదేవీలు జరిపినట్లు విశ్వసనీ య సమాచారం. గాంధీనగర్‌లో శివారులో ఓ వెంచర్‌లో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి దగ్గర 21 ప్లాట్ల పంచాయితీలో కూడా ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో విచారిస్తే చాలా సంఘటనలు వెలుగులోకి వస్తాయని బాధితులు తెలుపుతున్నారు. అంతేకాకుండా సమస్యలతో స్టేషన వచ్చేవారిని వారి సమస్యలను అలుసుగా తీసుకుని వారితో దురుసుగా ప్రవర్తిస్తున్నారని, పలువురు బాధితులు పోలీస్‌ ఉన్నతాఽధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

వసూళ్ల కోసమే ప్రత్యేక సిబ్బంది

పోలీ్‌సస్టేషనకు వచ్చే ఫిర్యాదులను పరిశీలించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసు మైనరా, మేజరా వాళ్లే డిసైడ్‌ చేసి బేరసారాలకు దిగుతున్నట్లు సమాచారం. రూరల్‌ పోలీ్‌సస్టేషన సూర్యాపేట, జనగామ, హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారులకు అనుసంధానంగా ఉంది. దీంతో ఉదయం, రాత్రి... వేళల్లో విధులు నిర్వహించే సిబ్బంది అక్రమ దందాలకు దిగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా సిబ్బంది ఐడీ పార్టీ అవతారమెత్తి ఏ కేసులో ఎంత... తీసుకోవాలే ని ర్ణయించుకుంటున్నారు. ఈ తతంగం అంతా అధికారి తెలిసే జరుగుతుందన్న ప్రచారమూ ఉంది.

ఉన్నతాధికారి అండదండలు

సూర్యాపేట పోలీ్‌సస్టేషన సంబంధించి ఓ అధికారికి, సిబ్బంది పోలీస్‌ శాఖలో పనిచేసే ఓ కీలక ఉన్నతాధికారి అండదండలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఆ ఉన్నతాధికారి ఈ స్టేషన పరిధిలో జరిగే ప్రతీ విషయాన్ని ఎస్పీ వరకు చేరకుండా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో స్టేషన సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగుచూసే అవకాశం ఉందంటున్నారు.

మా దృష్టికి రాలేదు

ఫిర్యాదుదారులతో సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. అమర్యాదగా ప్రవర్తించే సిబ్బందికి రోల్‌కాల్‌లో సీరియ్‌సగా హెచ్చరిస్తా. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు వస్తున్న ఆరోపణలలో ఎలాంటి వాస్తవం లేదు. సివిల్‌ కేసుల్లో తలదూర్చడం లేదు. అలాంటి ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకువస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం.

- బాలునాయక్‌, సూర్యాపేట రూరల్‌ ఎస్‌ఐ

Updated Date - Mar 07 , 2026 | 12:42 AM