వానల్లేవ్..చేపల్లేవ్
ABN , Publish Date - Nov 21 , 2026 | 12:55 AM
చెరువులు నిండుగా ఉంటేనే మత్స్యకారులకు ఉపాధి లభిస్తుంది. వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నీటితో కళకళలాడితేనే చేపల పెంపకం, వేట సాగుతుంది. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక జిల్లాలోని చెరువులు, కుంటల్లో నీటిమట్టాలు అడుగంటడంతో ప్రభుత్వం నుంచి ఉచితంగా చేప పిల్లల పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది.
అడుగంటుతోన్న చెరువులు, కుంటలు
తొలి లక్ష్యం 661 చెరువుల్లో 2.81కోట్ల చేపపిల్లలు
ప్రశ్నార్థకంగా మారిన చేప పిల్లల పంపిణీ
టెండరు ప్రతిపాదన లక్ష్యం 107 చెరువుల్లో 97.13లక్షలకు కుదింపు
జిల్లాలో 198 మత్స్యకార సొసైటీలు, 11,564 కుటుంబాలపై ప్రభావం
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): చెరువులు నిండుగా ఉంటేనే మత్స్యకారులకు ఉపాధి లభిస్తుంది. వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నీటితో కళకళలాడితేనే చేపల పెంపకం, వేట సాగుతుంది. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక జిల్లాలోని చెరువులు, కుంటల్లో నీటిమట్టాలు అడుగంటడంతో ప్రభుత్వం నుంచి ఉచితంగా చేప పిల్లల పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో జీవనం ఎలా అని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని మత్స్యకారుల జీవనోపాధికి ఎల్‌నినో అడ్డంకిగా మారింది. ఈ నెల 21న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం నిర్వహించే వేళ వారి జీవ న పరిస్థితులు క్షేత్రస్థాయిలో ఆందోళనకరంగా కనిపిస్తున్నాయి. మత్స్య సంపదను సంరక్షించడం, స్థిరంగా చేపల పెంపకాన్ని ప్రోత్సహించడం, మత్స్యకారుల సంక్షేమం, జీవనభద్రతకు ప్రాధా న్యం ఇవ్వాలనే లక్ష్యంగా సాగాల్సిన రోజు, చేప పిల్లల పెంపకమే కష్టంగా మారి వారి ఉపాధిపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
661 చెరువుల నుంచి 107కు కుదింపు
వానాకాలం సీజన్‌కు ముందు వరుణుడు కరుణిస్తే జిల్లాలోని 661 చెరువుల్లో 2.81కోట్ల చేపపిల్లలను ఉచితంగా విడిచిపెట్టాలని మత్స్యశాఖ అధికారులు ప్రతిపాదించారు. అయితే ఈ ఏడాది ఎన్‌నినో ప్రభావంతో వర్షా ల జాడలేదు. అక్టోబరు నాటికి జిల్లాలోని చెరువుల్లో నీటిమట్టాల పరిస్థితులకు అనుగుణంగా 50శాతం నీటి మట్టం ఉన్న చెరువుల్లో మాత్ర మే చేపపిల్లలను వదిలిపెట్టాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనల మేరకు జిల్లాలో చేపపిల్లల పంపిణీకి చెరువులను 661 నుంచి 107 కు కుదించారు. చేపపిల్లల లక్ష్యం కూడా 2.81 కోట్ల నుంచి 97.13లక్షలకు కుదించారు. ఆ తర్వాత కూడా ఆశించినట్టు వర్షాలు లేక చెరువుల్లో నీటి మట్టాలు వేగంగా అడుగంటుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో సుమారు మూడొంతులకు పైగా చెరువుల్లో 25శాతం కంటే తక్కు వ నీటిమట్టం లేదా నీరు లేనివి ఉన్నాయి. చేపపిల్లల విడుదలకు కాంట్రాక్టర్లను ఖరారు చేసినా, చెరువుల్లో అనుకూలమైన నీటిమట్టా లు లేవు. తగినంత నీటిమట్టం లేని చెరువుల్లో చేపపిల్లలను వదిలితే అవి ఎదిగే పరిస్థితులు ఉండవని, నీరు తగ్గిపోతే వాటి మనుగడకు ముప్పని అధికారులు అభిప్రాయపడుతున్నా రు. దీంతో ప్రభుత్వం పంపిణీ చేసే చేపపిల్ల లు ఎన్ని చెరువుల్లో, ఎంత సంఖ్యలో వదులు తారానేది కూడా ప్రశ్నార్థకంగా మారింది.
11,564 కుటుంబాలపై ప్రభావం
జిల్లాలో 198 మత్స్యకార సహకార సంఘాలు ఉండగా, వీటిపై 11,564 మంది ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. చేపల పెంపకం, వేట, విక్రయాలే వీరికి జీవనాధారం. చెరువుల్లో నీరు లేక చేపపిల్లలు వదలకపోతే, ఉత్పత్తి లేక ఉపాధి లేకుండా పోయే ప్రమాదం నెలకొననుంది. ఇప్పటికే వర్షాభావం కారణంగా సహజసిద్ధంగా చెరువుల్లో చేపల దిగుబడి కూ డా గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో మత్స్యకారుల ఉపాధిపై మరింత ప్రభావం పడనుంది. మత్స్యకారుల సంక్షేమ, ఉపాధి భద్రతపై దృష్టిసారించాల్సిన తరుణంలో ప్రకృతి వైపరీత్యం వారి జీవనాధారాన్ని దెబ్బతీస్తోంది.
జిల్లాలో చేపల పెంపకం వనరులు
వర్షాకాలం ముందు చేపపిల్లల :661చెరువులు
విడుదలకు ప్రతిపాదిత చెరువులు
చేపపిల్లల సంఖ్య :2.81కోట్లు
వర్షాభావ పరిస్థితుల్లో ప్రతిపాదిత చెరువులు :107
చేప పిల్లల సంఖ్య కుదింపు :97.13 లక్షలు
మత్స్యకార సహకార సంఘాలు :198
సంఘాల్లో నమోదైన కుటుంబాలు :11,564