Share News

నిర్మాణం.. శరవేగం..

ABN , Publish Date - May 12 , 2026 | 11:58 PM

పాలకవీడు, మే 12 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కృష్ణానదిపై రూ.303 కోట్లతో నిర్మిస్తున్న జానపహాడ్‌ జవహర్‌ ఎత్తిపోతల పథకం పనులు మమ్మురంగా సాగుతున్నాయి.

 నిర్మాణం.. శరవేగం..

పాలకవీడు, మే 12 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కృష్ణానదిపై రూ.303 కోట్లతో నిర్మిస్తున్న జానపహాడ్‌ జవహర్‌ ఎత్తిపోతల పథకం పనులు మమ్మురంగా సాగుతున్నాయి. జూలై మొదటి వారంలోపు పూర్తిచేయాలని మంత్రి ఉత్తమ్‌ ఆదేశానుసారం అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. ఈ ఎత్తిపోతల ద్వారా పాలకవీడు మండలంలో 70శాతం సాగు, తాగు నీరు సమస్య తీరుతుంది. సాగర్‌ ఎడమకాల్వ ఆయకట్టు చివరి భూములైన పాలకవీడు మండలానికి నీరు విడుదలైన నెలరోజుల వరకు గానీ పొలాలకు నీళ్లు రావు. ఈ జానపహాడ్‌ ఎత్తిపోతల పథకం ద్వారా మండలంలో సాగర్‌ డ్యాం నిండిన, నిండకున్నా మండలంలోని 15 గ్రామాల్లో సుమారు 15వేల ఎకరాల సాగు నీరు అందనుంది. ప్రతి ఏడాది వర్షాలపై ఆధారపడుతున్న రైతులు ఈ ఎత్తిపోతల పథకం పెద్ద ఊరటనివ్వనుంది. ఈ పథకం ద్వారా భూగర్భ జలాలు, బావుల్లో నీటి మట్టం పెరిగి బోర్లలో నీళ్లు పైకి వస్తాయని రైతులు చెబుతున్నారు.

నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ..

జవహర్‌ ఎత్తిపోతల నిర్మాణం పూర్తి భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ఆధునిక సాంకేతిక పరి జ్ఞానంతో పనులు చేపడుతున్నారు. గుండెబోయినగూడెం నుంచి జానపహాడ్‌ మేజర్‌పై ఉన్న ఆర్‌-11 వరకు సుమారు 25 కిలోమీటర్ల దూరం 1200 ఎంఎం, 900 ఎంఎం వ్యాసార్థం గల భారీ పైప్‌లైన నిర్మిస్తున్నారు. ఈ పైపులను భూమిలో అమర్చడానికి భారీక్రేన్లు వినియోగిస్తున్నారు. పథకం పూర్తయితే పాలకవీడు మండలంలో జానపహాడ్‌, కల్మెట్‌తండాకు నీటికొరత ఉన్న గ్రామాలు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా జానపహాడ్‌ చెర్వులో ప్రత్యేకంగా నీరు చేరే విధంగా ఏర్పాట్లు చేశారు.

త్వరలో ప్రారంభానికి సన్నాహాలు

వానాకాలానికి ముందే పనులు పూర్తిచేసి జానపహాడ్‌ జవహార్‌ ఎత్తిపోతల పథకాన్ని పాలకవీడు మండల ప్రజలకు అంకితం చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో మంత్రి తరుచూ ఈ ఎత్తిపోతల పనులకు పర్యవేక్షించారు. మిగిలిన పనులు కూడా వేగవంతం పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూ పొందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు రాత్రింబవళ్లు పనులు నిర్వహిస్తున్నారు.

పూర్తి కావొచ్చిన బ్రిడ్జి నిర్మాణం

(ఆంధ్రజ్యోతి- మేళ్లచెర్వు) మేళ్లచెర్వు- కోదా డ మార్గమధ్యలో కందిబండ వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 2024 ఆగస్టు లో కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జి పూర్తిగా ధ్వస మైంది. దీంతో బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి ఉత్తమ్‌ చొరవతో రూ. 3 కోట్లు నిధులు మంజూరు చేశారు. నిర్మాణ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ బ్రిడ్జి పక్కన వాహనాల రాకపోకల తాత్కాలిక రోడ్డును నిర్మించాడు. ఈ మార్గం గుండా ప్రతినిత్యం వంద ల సంఖ్యలో వాహ నదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2025 జూనలో పనులు ప్రారంభం కాగా తుది దశకు చేరుకున్నాయి. బ్రిడ్జి ప్రధాన ఘట్టమైన శ్లాబ్‌ పూర్తయింది. ఇంకా మరోసారి శ్లాబ్‌ వేయడంతో పాటు, రోడ్డు ఇరువైపులా మరో రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంది.

తుది దశ లో బ్రిడ్జి నిర్మాణం

బ్రిడ్జి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నా యి.బ్రిడ్జి ఉపరితలాన ఫినిషింగ్‌ కోట స్లాబ్‌ నిర్మిం చి బ్రిడ్జికి ఇరువైపులా బ్రిడ్జికి సమాంతరంగా రోడ్డు నిర్మాణ పనులు చేపడితే నిర్మాణ పనుల పూర్తయ్యాయి.త్వరలోనే బ్రిడ్జి అందుబాటులోకి వస్తుంది.

- శివకుమార్‌, ఆర్‌ అండ్‌ బీ ఏఈ

Updated Date - May 12 , 2026 | 11:59 PM