Share News

దత్తాయపల్లి వేదికగా నూతన ఆవిష్కరణలు

ABN , Publish Date - Mar 28 , 2026 | 12:01 AM

తుర్కపల్లి,మార్చి27(ఆంధ్రజ్యోతి):మండలంలోని దత్తాయపల్లి వేదికగా నూతన ఆవిష్కరణలను ప్రారంభించనున్నట్లు, ఇన్నోయాత్ర ఔత్సాహికులు తెలిపారు.

దత్తాయపల్లి వేదికగా నూతన ఆవిష్కరణలు

తుర్కపల్లి,మార్చి27(ఆంధ్రజ్యోతి):మండలంలోని దత్తాయపల్లి వేదికగా నూతన ఆవిష్కరణలను ప్రారంభించనున్నట్లు, ఇన్నోయాత్ర ఔత్సాహికులు తెలిపారు. టీ హబ్‌ ఆధ్వర్యంలో ఇన్నో యాత్ర-2026 బృందంవ్యాప్తంగా ఆవిష్కరణలపై యాత్ర చేపట్టింది. అందులో భాగంగా ఈయాత్ర బృందం శుక్రవారం దత్తాయపల్లి గ్రామానికి చేరుకుంది.గ్రామంలో మామిండ్ల అమరేందర్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో నెలకొల్పిన యాదాద్రి ఆగ్రో ప్రాసెసింగ్‌ సెంటర్‌ను సందర్శించి పరిశీలించారు. ప్రాసెసింగ్‌ సెంటర్‌ పనితీరును అడిగి తెలుసుకున్నారు. గ్రామాన్ని దత్తత తీసుకుని కొత్త ఇన్నోవేషన్‌ కార్యక్రమాలు చేపడుతామని, అం దుకు గ్రామస్థులు సహకరించాలని కోరారు. యాత్రలో 35 మంది ఔత్సాహికు లు గ్రామానికి రావడంతో సర్పంచ్‌ జెర్రిపోతుల కరుణాకర్‌ స్వాగతం పలికారు.

Updated Date - Mar 28 , 2026 | 12:01 AM