Share News

అర్చక సంఘం జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

ABN , Publish Date - Feb 19 , 2026 | 12:24 AM

ధూప దీప నైవేద్య అర్చక సంఘం జిల్లా సర్వసభ సమావేశం భువనగిరి పట్టణంలోని పచ్చలకట్ట సోమేశ్వరాలయంలో నిర్వహించారు.

అర్చక సంఘం జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

భువనగిరి గంజ్‌, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): ఽధూప దీప నైవేద్య అర్చక సంఘం జిల్లా సర్వసభ సమావేశం భువనగిరి పట్టణంలోని పచ్చలకట్ట సోమేశ్వరాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రదాన కార్యదర్శి హరికీర్తి అమరేశ్వర శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలోని ధూప దీప పైవేద్య అర్చకులు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా జోషి పవన కుమార్‌ శర్మ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా కొల్లావరుఘుల శ్రీనివాస్‌ శర్మ, శంకు భద్రప్ప, ప్రధాన కార్యదర్శిగా నిమ్మల అమలేశ్వర్‌, కార్యదర్శిగా వల్లంబట్ల శ్రీనివాస్‌శర్మ, కోశాధికారిగా మూటకొండూరు కార్తీక్‌శర్మ, సహాయ కార్యదర్శిగా పసునూరి నిత్యానందం, ప్రచార కార్యదర్శిగా మంచోజ్‌ చంద్రశేఖరచార్యులు, కార్యవర్గ సభ్యులుగా మోత్కూర్‌ ప్రదీప్‌ శర్మ, నేరెళ్లపల్లి హరిబాబు శర్మ, కొల్లాపూర్‌ మహేందర్‌ శర్మలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో నారాయణ మణికంఠ శర్మ, పవన శర్మ, చలివేదుల రాజేశ్వర శర్మ పాల్గొన్నారు.

Updated Date - Feb 19 , 2026 | 12:24 AM