638 అడుగులకు మూసీ నీటిమట్టం
ABN , Publish Date - May 29 , 2026 | 12:11 AM
కేతేపల్లి, మే 28(ఆంధ్రజ్యోతి): మూసీ జలాశయ నీటిమట్టం 638 అడుగులకు చేరింది. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఎగువ ప్రాంతాలు, హైదరాబాద్ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోతో ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వస్తోంది.
కేతేపల్లి, మే 28(ఆంధ్రజ్యోతి): మూసీ జలాశయ నీటిమట్టం 638 అడుగులకు చేరింది. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఎగువ ప్రాంతాలు, హైదరాబాద్ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోతో ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 645అడుగులు(4.46టీఎంసీలు) పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం గల ఈ ప్రా జెక్టు నీటిమట్టం ఏప్రిల్ మొదటివారంలో ఆయకట్టుకు యాసంగి సాగుకు నీటి విడుదల ముగిసే నాటికి 624 అడుగుల కనిష్ఠానికి పడిపోయింది. అయితే నాటి నుంచి ఎగువనుంచి 500క్యూసెక్కులకు తగ్గకుండా ఇన్‌ఫ్లో వస్తుంది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం ఒక్కో అడుగు పెరుగుతూ645అడుగుల పూర్తిస్థా యి నీటిమట్టం దిశగా పయనిస్తుంది. ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ప్రాజెక్టు కుడి ప్రధాన కాల్వకు నీటిని విడుదల చేసే షట్టర్ దెబ్బతినడంతో కొన్నాళ్లుగా నీటి వృఽథా కొనసాగుతుంది. ప్రాజెక్టు నీటిమట్టం 624 అడుగుల కనిష్ట స్థాయికి తగ్గినప్పుడు మూసీ యంత్రాంగం కుడి కాల్వ షట్టర్‌కు మరమ్మతులు చేస్తే నీరు వృఽథాగా వెళ్లకుండా ఉండేదని ఆయకట్టు రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. కాగా మూసీ ప్రస్తుత నీటిమట్టం 638అడుగులు(2.77టీఎంసీలు)గా ఉంది. ఎగువ నుంచి 337క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.