Share News

మోదీ.. ఉచిత సలహాలు మానుకో

ABN , Publish Date - May 13 , 2026 | 12:23 AM

ప్రధాని మోదీ ఉచిత సలహాలు మానుకొని, విదేశాంగ వ్యవహారాలను సరిదిద్దుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జానవెస్లీ అన్నారు.

మోదీ.. ఉచిత సలహాలు మానుకో
సమావేశంలో మాట్లాడుతున్న జానవెస్లీ

విదేశాంగ వైఫల్యమే సంక్షోభానికి మూలం

రేవంతరెడ్డి ఇచ్చిన హామీలు అమలు కాలే

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జానవెస్లీ

చౌటుప్పల్‌, మే 12 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ ఉచిత సలహాలు మానుకొని, విదేశాంగ వ్యవహారాలను సరిదిద్దుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జానవెస్లీ అన్నారు. చౌటుప్పల్‌ మండల కేంద్రంలో మంగళవారం సీపీఎం జిల్లా విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జెండాను సీనియర్‌నేత ఎండీ పాషా ఆవిష్కరించారు. సీపీఎంనేత రొడ్డ అంజయ్య చిత్రపటం వద్ద జానవెస్లీ నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో జానవెస్లీ మాట్లాడుతూ యుద్ధం కారణంగానే దేశంలో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ లాంటి నిత్యావసర ధరలు పెరిగాయన్నారు. సన్నిహిత సంబంఽధాలు ఉన్న ఇరాన, రష్యాతో వ్యాపార సంబంధాలు వదిలేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మోదీ భయపడుతున్నాన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమారుడు బాలికపై లైంగికదాడికి ఒడిగట్టడం దారుణమన్నారు. సీఎం రేవంతరెడ్డి ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య మాట్లాడుతూ పెట్టుబడి, సామ్రాజ్యవాద దేశాల్లో సమస్యలు పెరిగిపోతున్నాయన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్‌, రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, నర్సింహ, కల్లూరి మల్లేశం, మాటూరి బాలరాజు, జల్లెల పెంటయ్య, గుంటోజు శ్రీనివాసాచారి, ఎండీ పాషా, కరుణాకర్‌, సైదులు, కృష్ణయ్య, బత్తుల జయమ్మ, పల్లె మధు కృష్ణ, గడ్డం వెంకటేశం పాల్గొన్నారు.

Updated Date - May 13 , 2026 | 12:23 AM