ఆధునికం.. ఆధ్యాత్మికం
ABN , Publish Date - Apr 07 , 2026 | 12:20 AM
అద్భుత ఆధ్యాతిక క్షేత్రంగా రూపుదిద్దుకు న్న పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దేశవ్యాప్తంగా యాత్రీకులు సందర్శిస్తుం టారు. హైదరాబాద్ మహానగరం నుంచే కాకుండా, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు సైతం దివ్యక్షేత్రం సందర్శనకు రైల్వే సదుపాయాలు అందుబాటులోకి తెస్తున్నారు.
యాదాద్రి(రాయిగిరి) రైల్వేస్టేషన్‌కు ప్రపంచస్థాయి ఆధునికీకరణ
అమృత్‌భారత్ స్టేషన్ పథకంలో రూ.24.5 కోట్లతో పనులు
ఆలయ రాజగోపురం నమూనాలో రైల్వేస్టేషన్ ప్రధాన ముఖద్వారం
ఆంధ్రజ్యోతి, యాదాద్రి/భువనగిరి రూరల్: అద్భుత ఆధ్యాతిక క్షేత్రంగా రూపుదిద్దుకు న్న పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దేశవ్యాప్తంగా యాత్రీకులు సందర్శిస్తుం టారు. హైదరాబాద్ మహానగరం నుంచే కాకుండా, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు సైతం దివ్యక్షేత్రం సందర్శనకు రైల్వే సదుపాయాలు అందుబాటులోకి తెస్తున్నారు. యాదగిరిగుట్ట పట్టణానికి అతి చేరువలో ఉన్న రాయిగిరి రైల్వేస్టేషన్ పేరును ఇటీవల యాదాద్రిగా పేరుమార్చిన రైల్వేశాఖ ‘అమృత్‌భారత్ స్టేషన్ పథకం’లో రైల్వేస్టేషన్‌కు సైతం ఆధ్యాత్మిక హంగులు, అత్యాధునిక సదుపాయాలు కల్పించనుంది. రైల్వేస్టేషన్ ఆధునికీకరణకు రూ.24.50 కోట్లు కేటాయించింది.
అమృత్‌భారత్ పథకంలో భాగం గా తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లలో పనులు చే పడుతున్నా యాదాద్రి(రాయిగిరి) రైల్వేస్టేషన్‌కు ఆధ్యాత్మిక హంగులు జోడించనుంది. హైదరాబా ద్ నగరంతో పాటు విజయవాడ, విశాఖపట్నం తదితర రాష్ట్రాలకు చెందిన యా త్రీకులు రైల్వే ప్రయాణ సదుపాయాలు వినియోగించుకుని, యాదగిరిగుట్టకు చేరుకుని మహిమా న్విత లక్ష్మీనరసింహులను దర్శించుకోవచ్చు. రైల్వేస్టేషన్‌ను సైతం ప్రాకార గోపురాలతో భక్తులను ఆకట్టుకునే విధంగా రూపొందించనున్నారు.
ప్రపంచస్థాయి రైల్వేస్టేషన్‌గా..
రైల్వేస్టేషన్ అభివృద్ధికి రైల్వేశాఖ కేటాయించిన రూ.24.50 కోట్ల నిధులతో రైలు ఆగినపుడు ప్రయాణికులు ఎక్కిదిగడానికి సౌలభ్యంగా ఫ్లాట్‌ఫారాల రీ సర్ఫేసింగ్ చేయనున్నారు. ఫ్లాట్ ఫారాల షెల్టర్లను ఆధునికీకరించనున్నారు. రైలు కోసం వేచి ఉండే ప్రయాణికుల కోసం ఎయిర్ కండీషన్‌తో కూడిన విశ్రాంతి హాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దివ్యాంగులు సైతం రైల్వేస్టేషన్‌కు సులభంగా రాకపోకలు సాగించి, రైలు ప్రయాణాలు చేసే విధంగా రూపొం దిస్తున్నారు. రైల్వేప్లాట్ ఫారం ప్రయాణికులకు పూర్తి భద్రత కల్పించే విధంగా సాంకేతికంగా చేసిన డిజైన్ ప్రకారం రైల్వేఫ్లాట్ పారాలను తీర్చిదిద్దుతున్నారు. అదే విధంగా రైల్వేస్టేషన్‌లో దిగిన ప్రయాణి కులు, ఇక్కడి నుంచి గమ్మస్థానాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులను ఇక్కడికి చేరే వేసే వాహనాలకు ప్రత్యేక పార్కింగ్‌ను సమకూరుస్తున్నారు.
రాజగోపురాన్ని తలపించేలా..
అమృతభారత్ స్టేషన్ పథకంలో స్థానికంగా ఉండే విశేష ప్రాచుర్యం కలిగించేరీతిలో రైల్వేస్టేషన్లలో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో ఉన్న యాదాద్రి రైల్వేస్టేషన్‌కు సైతం ఆధ్యాత్మిక హంగులతో ప్రత్యేక ఆకర్షణతో రూపుదిద్దుతున్నారు. రైల్వేస్టేషన్ ప్రధాన ముఖ ద్వారాన్ని ఆలయ రాజగోపురం నమూనాలో రూపొందించారు. రైల్వేస్టేషన్ ముందు భాగం కూడా ఆలయ ప్రాకరాన్ని తలపించే విధంగా తీర్చిదిద్దే పనులు కొన సాగుతున్నాయి. ప్రధాన ద్వారం ముందు భాగం ఆవరణను సైతం ల్యాండ్‌స్కేప్ గార్డెన్ సర్కిల్‌గా పచ్చదనంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నారు.
యాత్రికులకు అనువైన ప్రయాణ సదుపాయం
యాదాద్రి రైల్వేస్షేషన్‌ను ప్రపంచస్థాయి రైల్వేస్టేషన్‌గా తీర్చిదిద్దడం ద్వారా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించే యాత్రికులకు అనువైన ప్రయాణ సౌలభ్యం కలగనుంది. దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్- కాజీపేట- విజయవాడ మార్గంలో గల ఈ రైల్వే స్టేషన్‌లో ప్రస్తుతం కృష్ణా, కాకతీయ, పుష్‌పుల్ వంటి మూడు, నాలుగు రైళ్లు మాత్రమే ఆగుతున్నాయి. యాదాద్రి రైల్వేస్టేషన్ ఆధునికీకరణ తర్వాత ఈ మార్గంలో సూపర్ ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఎక్కువ సంఖ్యలో ఆగడానికి అవకాశాలుంటాయని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్టాప్‌లు ఏర్పాటు చేస్తే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన స్వామివారి భక్తులతో పాటు ఉత్తర భారతదేశానికి చెందిన యాత్రీకులు, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన యాత్రీకులు సైతం ఈ రైల్వేస్టేషన్‌ను వినియోగించుకునే అవకాశముంటుంది. యాదగిరిగుట్ట ఆలయాన్ని ప్రతిరోజూ సగటున 25వేల మంది భక్తులు సందర్శిస్తారు. వారిలో సుమారు అయిదు వేల మం ది ఈ రైల్వేస్టేషన్ ద్వారా రాకపోకలు సాగించే అవకాశాలున్నాయి.
పనుల పూర్తికి మరో ఏడాదిన్నర
రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు ప్రస్తుతం శరవేగంగా కొనసా గిస్తున్నారు. రైల్వేస్టేషన్‌లో ప్లాట్ పారంపై షెల్టర్లు, ఫ్లాట్ ఫారాల ఆధునికీరణ, విశ్రాంతి గది పాటు రైల్వేస్టేషన్ ముఖ ద్వారం రాజగోపురం నిర్మాణం పనులు కొనసాగిస్తున్నాయి. ఆమోదించిన డిజైన్ల ప్రకారం యాదాద్రిరైల్వేస్టేషన్ ప్రపంచస్థాయి ఆధునికీకరణ పనులు పూర్తికావడానికి మరో ఏడాదిన్నర పట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు.