Miryalaguda.. Another Goa!: మిర్యాలగూడ.. మరో గోవా!
ABN , Publish Date - May 05 , 2026 | 12:21 AM
పేకాట, క్యాసినో, మట్కా జూదానికి మిర్యాలగూడ డివిజన్ కేంద్ర బిందువుగా మారుతోంది. ఏపీ రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతాలకు చేరువలో డివిజన్ సరిహద్దు విస్తరించి ఉండడంతో జూదరులు ఇక్కడకి వస్తున్నట్లు తెలుస్తోంది.
క్యాసినో, మాట్కా, జూదం.. అదో లోకం
పట్టణకేంద్రంగా పేకాట శిబిరం
ఖరీదైన మద్యం, హుక్కా
ప్రోత్సహిస్తున్న ఓ ప్రజాప్రతినిధి?
పొరుగు రాష్ట్రం నుంచి జూదరుల రాక
ఆంధ్రజ్యోతి, మిర్యాలగూడ అర్బన్ : పేకాట, క్యాసినో, మట్కా జూదానికి మిర్యాలగూడ డివిజన్ కేంద్ర బిందువుగా మారుతోంది. ఏపీ రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతాలకు చేరువలో డివిజన్ సరిహద్దు విస్తరించి ఉండడంతో జూదరులు ఇక్కడకి వస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బడాబాబులు మిర్యాలగూడకు వచ్చి రోజుల తరబడి రెస్టారెంట్లలో బసచేసి, రాత్రి 8గంటలకు పేకాట స్థావరాలకు చేరుకొని తెల్లవారుజాము వరకు జూదంలో మునిగితేలుతున్నారు. పేకాటేకాదు బెట్టింగులు, అసాంఘిక కార్యకలాపాలు సైతం యథేచ్చగా కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
నగరాలు, పట్టణాలకు పరిమితమైన కొనసాగుతున్న క్లబ్‌లను మూసివేస్తూ 2014లో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీచేసింది. దీంతో క్లబ్‌లు మూతపడగా, పేకాట జూదంపై నిసేదం అమల్లోకి వచ్చింది. జూదానికి అలవాటైన వారిని ఒకటిచేసి రహస్య ప్రదేశాల్లో మూడోకంట పడకుండా పేకాట స్థావరాలు నడిపించడం మొదలైంది. పండ్లతోటలు, ఫాంహ్‌సలు సేఫ్‌జోన్లుగా మారాయని తెలుస్తోంది. డబ్బున్న వారికి నిర్వాహకులు అభిరుచికి తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏసీ గదులు, ఖరీదైన మద్యం, హుక్కా వంటి సదుపాయాలు సమ కూర్చి ఆకట్టుకుంటున్నారు. ఈ తరహా హైటెక్ పేకాట శిబిరాలకు మిర్యాలగూడ, నాగార్జుసాగర్ నియోజకవర్గాలు కేరాఫ్ అడ్ర్‌సగా మారు తున్నాయి. ఏపీ రాష్ట్రానికి చేరువలో ఈ నియోజకవర్గాల సరిహద్దు విస్తరించి ఉండడంతో పల్నాడు జిల్లానుంచి జూదరులు వారాంతం(శని, ఆదివారం) చివరి రోజుల్లో నాగార్జునసాగర్, హాలియా, మిర్యాలగూడ నగరాల్లో పగలంతా బసచేసి రాత్రివేళలో రహస్యంగా ఏర్పాటైన పేకాట స్థావరాలకు చేరుకుంటున్నారు. లక్షలాది రూపాయల బెట్టింగ్ నిర్వహి స్తున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతాల్లో తిరిగే వ్యక్తులను పసిగట్టేందుకు సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేసి పక్కాగా నడిపిస్తున్నారు.
తెర వెనుక
వేసవి విడిది, పర్యాటక ప్రదేశమైన గోవాకు పరిమితమైన క్యాసినో కల్చర్ మిర్యాలగూడకు చేరింది. క్రీడను కాయిన్స్‌తో కొనసాగిస్తారు. జూదరులు మొదటగా తమ వద్ద ఉన్న డబ్బులు నిర్వాహకులకు అప్పగించి వారినుంచి కాయిన్స్(బిల్లలు) తీసుకుంటారు. ఒక్కో కాయిన్ విలువ రూ.500తో మొదలైన రూ.10వేల వరకు ఖరారు చేస్తారు. బెట్టింగ్‌లో వినియోగించే కాయిన్స్ విలువను గుర్తించేలా ప్రత్యేక రంగు, ఆకారంలో తయారుచేసి జూద రులకు విక్రయించడంలో నిర్వాహ కులు కీలక పాత్రపోషిస్తారు. క్యాసినో బెట్టింగ్‌లో గెలిచిన వారికి నగదు చెల్లించే క్రమంలో నిర్వాహకుడికి 25శాతం కమీషన్ చెల్లించుకునేలా నిబంధనలుం టాయి. షరతులకు లోబడిన తర్వాతే టేబుల్ మీదకు అనుమతి లభిస్తుంది. మిర్యాలగూడలోని హనుమాన్‌పేట శివారు కాలనీలో ఏర్పాటైన పేకాట శిబిరంలో 500కాయిన్స్ పోలీసుల దాడుల్లో లభ్యమయ్యాయి. వీటిని క్యాసినో జూదం ఆడేవారికి విక్రయిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. పోలీసులు గుర్తించిన స్థావరంలో ఖరీదైన మద్యం బాటిళ్లు, హుక్కా కిట్టు లభించాయి. ఇప్పటికి ఈతరహా జూదం గోవాకు పరిమితం కాగా, ఇప్పుడది మిర్యాలగూడలో అందుబాటులోకి తేవడం వెనుక తాజాగా పదవి దక్కించుకున్న ఓ యువ ప్రజాప్రతినిఽధి హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కొన్నేళ్లుగా గుట్టుగా సాగిపోతున్న పేకాట, మట్కా, క్యాసినో వంటి జూదంలో అతని పాత్ర, సహకరిస్తున్న వారి లెక్కలు తేల్చేపనిలో పోలీస్ నిఘా వర్గాలు పడ్డాయి. అదేవిధంగా మహారాష్ట్రలో ప్రాచుర్యం పొందిన మట్కాను సైతం ఇక్కడ నిర్వహి స్తున్నట్లు పోలీస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. రాష్ట్రంలో నిషేదంలో ఉన్న జూదానికి తెరతీయడంలో కొందరు ప్రముఖుల సహకారం ఉన్నట్లు పోలీస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఫ తాజాగా మిర్యాలగూడలోని స్థానిక హనుమాన్‌పేట కాలనీలో గుట్టుగా సాగిపోతున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడిచేసే సంద ర్భంలో కొందరు స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వకుండా పొరుగు మండలాల సిబ్బందిని వాడుకొని ఆకస్మిక దాడి చేయడం ఆ శాఖలో చర్చానీయాంశమైంది. నేరాల నియంత్రణలో తనదైన పాత్రపోషిస్తున్న సబ్‌డివిజన్ పోలీస్ ప్రతిష్టను దిగజార్చి ఒంటెద్దు పోకడ అవలంబిస్తున్న సిబ్బందిని గుర్తించి శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
పోలీసుల పాత్రపై అనుమానాలు
పేకాట, మట్కా, క్యాసినో వంటి జూదాన్ని పట్టణ నడిబొడ్డులో యథేచ్చగా నడుస్తున్నా స్థానిక పోలీసుల కనీస సమాచారం అందక పోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓ దశలో డివిజన్ స్థాయి అధికారిని బలిపశువు చేసేందుకు దిగువస్థాయి అధికారులు సిద్దపడ్డ తీరు పోలీ్‌సశాఖకు మచ్చతెచ్చిపెట్టింది. ఇటీవల సదరు అధికారి తన కిందిస్థాయి సిబ్బంది ప్రవర్తనపై సన్నిహితుల ఎదుట తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట. నేరాల నియంత్రణ, అక్రమదందాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు అరికట్టేందుకు అనుసరించాల్సిన అం శాలపై దిశానిర్థేశం చేసినా కొందరు తమ పంఽఽథా మార్చుకోకుండా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పోలీసు వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. బాధ్యతాయుతమైన హోదాలో ఉండి మెండిగా ప్రవర్తిస్తున్న తమ సిబ్బంది తీరుపై అసంతృప్తిచెందిన ఆయన తనబదిలీ కోసం స్వయంగా ఉన్నతాధికారులకు ఆర్జీపెట్టుకున్నారు. ఈ లోపే సాధారణ బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. డివిజన్ స్థాయి అధికారే స్వయంగా బదిలీ కోసం ఆర్జీ పెట్టుకోవడం వెనుక కారణ మే మిటన్న కోణంలో ఆ శాఖ ఉన్నతాధికారులు ఆలోచన చేశారు. అస లేమి జరుగుతోందో తెసులుసునేందుకు స్పెషల్‌బ్రాంచ్, ఇంటెలిజెన్స్ వర్గాలను రంగంలోకి దింపారు. ఈ ఆక్రమంలోనే మిర్యాలగూడ కేం ద్రంగా పెద్దఎత్తున సాగుతున్న జూదం వ్యవహారం వెలుగులోకి వచ్చి నట్లు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో పాత్ర, సూత్రదారులను గుర్తించే పనిలో ఉన్నతాధికారులు నిమగ్రమైనట్లు తెలుస్తోంది.