రెడ్‌క్రాస్ సొసైటీలో సభ్యులను చేర్పించాలి
ABN , Publish Date - May 03 , 2026 | 11:31 PM
మోత్కూరు, మే 3 (ఆంధ్రజ్యోతి): సమాజ సేవపై ఆసక్తి ఉన్న వారిని గుర్తించి రెడ్‌క్రాస్ సొసైటీలో సభ్యులుగా చేర్పించాలని రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన డాక్టర్ గుర్రం లక్ష్మీనర్సింహారెడ్డి కోరారు.
రెడ్‌క్రాస్ సొసైటీలో సభ్యులను చేర్పించాలి మోత్కూరు, మే 3 (ఆంధ్రజ్యోతి): సమాజ సేవపై ఆసక్తి ఉన్న వారిని గుర్తించి రెడ్‌క్రాస్ సొసైటీలో సభ్యులుగా చేర్పించాలని రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన డాక్టర్ గుర్రం లక్ష్మీనర్సింహారెడ్డి కోరారు. మోత్కూరులో ఆదివారం రెడ్‌క్రాస్ సభ్యత్వ నమోదు స్పెషల్ డ్రైవ్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలోని అన్ని మండలాల్లో రెడ్‌క్రాస్ కమిటీలను ఏర్పాటు చేసేందుకుగాను విస్తృతంగా సభ్యత్వ నమోదు చేపట్టామన్నారు. ఆసక్తి ఉన్నవారు భవనగిరి పాత వివేరా హోటల్ పక్కన ఉన్న తమ రెడ్‌క్రాస్ కార్యాలయం లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు సభ్యత్వం తీసుకోవచ్చన్నారు. సభ్యత్వ రుసుం రూ.1,160 ఉంటుందని, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, ఆధార్ జిరాక్స్‌తో దరఖాస్తు ఫారమ్ నింపి ఇస్తే పరిశీలించి సభ్యత్వం ఇస్తామన్నారు. పూర్తి వివరాల కోసం 8985960689 నంబర్‌లో సంప్రదించవ చ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా డైరెక్టర్లు పన్నాల శ్రీనివా్‌సరెడ్డి, కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి, ఎండి.ఖలీల్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు బీసు మత్స్యగిరి, మండల ఉపాధ్యక్షుడు ముప్ప వెంకట్‌రెడ్డి, బద్దం నాగార్జునరెడ్డి, తిరుమల్‌రెడ్డి, దేవరపల్లి అశోక్‌రెడ్డి, ఎ.శోభనబాబు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.