నకిలీ విత్తన విక్రయ ముఠా సభ్యుడి అరెస్ట్
ABN , Publish Date - Jun 24 , 2026 | 12:00 AM
అంతర్రాష్ట్ర నకిలీ పత్తి విత్తన విక్రయ ముఠా సభ్యుడిని యాదాద్రిభువనగిరి జిల్లా తుర్కపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను తుర్కపల్లి పోలీ్‌సస్టేషనలో డీఎస్పీ శ్రీనివాసనాయుడు మంగళవారం వెల్లడించారు.
ఏపీ నుంచి సిద్ధిపేటకు తరలిస్తుండగా పట్టివేత
తుర్కపల్లి, జూన 23(ఆంధ్రజ్యోతి) : అంతర్రాష్ట్ర నకిలీ పత్తి విత్తన విక్రయ ముఠా సభ్యుడిని యాదాద్రిభువనగిరి జిల్లా తుర్కపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను తుర్కపల్లి పోలీ్‌సస్టేషనలో డీఎస్పీ శ్రీనివాసనాయుడు మంగళవారం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ రాష్ట్రం గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం కేశనపల్లి గ్రామానికి చెందిన దొండపాటి మల్లిఖార్జునరావు, చిత్తూరు జిల్లా బీ కొత్తకోట మండలకేంద్రానికి చెందిన శంకర్ కలిసి నకిలీ పత్తి విత్తనాల వ్యాపారం చేస్తున్నారు. ఆ విత్తనాలను శంకర్ సహకారంతో దొండపాటి మల్లిఖార్జునరావు గుంటూరు జిల్లా నుంచి సిద్ధిపేట జిల్లాలో విక్రయించేందుకు తీసుకెళ్తు న్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీ్‌సలు వ్యవసాయశాఖాధికారులతో కలిసి తుర్కపల్లి బస్టాండ్‌లో అతడిని అదుపులోకి తీసుకుని నిషేధిత రూ.10 లక్షల విలువైన బీజీ-2 పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. మల్లికార్జునరావుపై కేసు నమోదు ఏసి, మరో నిందితుడు శంకర్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో యాదగిరిగుట్ట రూరల్ సీఐ శంకర్‌గౌడ్, ఎస్‌ఐ తక్యుద్దీన, మండల వ్యవసాధికారి ఉమ, పోలీస్ సిబ్బంది ఉన్నారు.