ఫీజు నియంత్రణకు చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - May 29 , 2026 | 12:13 AM
మిర్యాలగూడ అర్బన్, మే 28 (ఆంధ్రజ్యోతి) : కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణకు చర్యలు తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడి జీడయ్యయాదవ్ కోరారు. న
మిర్యాలగూడ అర్బన్, మే 28 (ఆంధ్రజ్యోతి) : కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణకు చర్యలు తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడి జీడయ్యయాదవ్ కోరారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యను వ్యాపారంగా మార్చుకున్నాయని, కళాశాలల్లో లక్షలాది, పాఠశాలల్లో వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తు న్నాయన్నారు. వేసవి సెలవుల్లోనూ కార్యకలాపాలు నిర్వహిస్తున్న విద్యాల యాలపై చర్యలు తీసుకోవాలన్నారు. విద్యాసంవత్సరం ఆరంభం కానున్న నేపఽథ్యంలో వెంటనే ఫీజు నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘ నాయకులు భైరం సుధాకర్, వెంకటేష్‌నాయక్, కనసాని నాగరాజు, షేక్ ముజ్జు, నరసింహ తదితరులు పాల్గొన్నారు.