అడవి పంది దాడిలో వ్యక్తికి గాయాలు
ABN , Publish Date - Mar 04 , 2026 | 12:25 AM
పెన్‌పహాడ్ మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలంలోని మాచారం గ్రామంలో ఓ వ్యక్తిపై అడవి పంది దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి.
పెన్‌పహాడ్ మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలంలోని మాచారం గ్రామంలో ఓ వ్యక్తిపై అడవి పంది దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన ఉ ప్పల గంగయ్య(60) తన రేగళ్ల పొలం వద్దకు మంగళవారం వెళ్లగా అడవి పంది దాడి చేయడంతో తన పొట్టలో నుంచి పేగులు బయటికి వెళ్లాయి. సమాచారం తెలుసుకున్న గంగయ్య కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ కు సమాచారం అందించగా... అంబులెన్స్ ఈఎంఐ బుస్సా సురేష్, పైలెట్ నక్క శ్రీనివాస్ హుటాహుటిన అతడికి మెరుగైన చికిత్స కోసం అతన్ని సూర్యాపేట ప్రైవేటు హాస్పిటల్‌కి తరలించారు. పరిస్థితి విషమించడంతో అతనికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. పూర్తి విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.