త్రుటిలో తప్పిన పెనుప్రమాదాలు
ABN , Publish Date - Jul 14 , 2026 | 12:22 AM
నార్కట్‌పల్లి, జూలై 13 (ఆంధ్రజ్యోతి):హైమాస్ట్ లైట్ల స్తంభం ఒక వైపునకు ఒరిగిన ఘటనలో తృటిలో పెనుప్రమాదం తప్పింది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టులో సోమవారం భారీ నంది విగ్రహం పక్కనే హైమాస్ట్‌లైట్ల విద్యుత స్తం భం అడుగుభాగం తుప్పుపట్టి ప్రమాదకరంగా మారింది.
నార్కట్‌పల్లి, జూలై 13 (ఆంధ్రజ్యోతి):హైమాస్ట్ లైట్ల స్తంభం ఒక వైపునకు ఒరిగిన ఘటనలో తృటిలో పెనుప్రమాదం తప్పింది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టులో సోమవారం భారీ నంది విగ్రహం పక్కనే హైమాస్ట్‌లైట్ల విద్యుత స్తం భం అడుగుభాగం తుప్పుపట్టి ప్రమాదకరంగా మారింది. సోమవారం ప్రమాదవశాత్తు స్తంభం ఓ వైపునకు ఒరిగింది. ఒరిగిన వైపు నుంచే విద్యుత లైన వెళ్తుండగా ఆ తీగలకు ఆనుకుని కిందకు పడకుండా ఆగిపోయింది. దీంతో తృటిలో పెను ప్రమాదమే తప్పింది. వెంటనే దేవస్థానం అధికారులు స్పందించి విద్యుత సరఫరా నిలిపివేసి హైమాస్ట్ లైటు స్తంభాన్ని తొలగించారు. ఘటనా స్థలాన్ని ధర్మకర్తల మండలి చైర్మన వారాల రమేశ, ధర్మకర్తలతో పాటు ఈవో మోహనబాబు పరిశీలించారు. సోమవారం భక్తుల రద్దీ నేపథ్యంలో కిందపడి ఉంటే ప్రమాదం జరిగేందని చర్చించుకున్నారు.
ట్రక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్
మోత్కూరు, జూలై 13 (ఆంధ్రజ్యోతి): యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూరు బిక్కేరు వాగు వంతెనపై సోమవారం తృటిలో పెద్దప్రమాదం తప్పింది. జనగాం డిపోకు చెందిన బస్సు ప్రయాణికులతో మోత్కూరుకు వాగు వంతెనపై వస్తోంది. ఆర్టీసీ బస్సును గమనించకుండా భారీ ట్రక్‌డ్రైవర్ ఎదురుగా వంతెనపైకి వచ్చాడు. రెండు వాహనాలు వంతెన మధ్యకు వెళ్లాయి. ఇటు ముందుకు వెళ్లలేక, అటు వెనక్కి వెళ్లలేక ఇబ్బందిపడ్డారు. భారీ ట్రక్ వెనక్కి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో చివరకు ఆర్టీసీ డైవరే నెమ్మదిగా బస్సును వెనక్కు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ముందుకు ట్రక్‌ను తీసుకెళ్లే క్రమంలో బస్సును తాకుతూ వెళ్లింది. ఆ సమయంలో ప్రయాణికలు భయాందోళనకు గురయ్యారు. బస్సుముందు కొద్దిగా దెబ్బతినగా డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.