Share News

district at the forefront: జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం

ABN , Publish Date - Jan 27 , 2026 | 01:03 AM

అంకితభావంతో పనిచేసి జిల్లాను అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలుపుదామని కలెక్టర్‌ ఎం.హనుమంతరావు అన్నారు. సోమవారం 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూ నియర్‌ కళాశాలలో జాతీయజెండా ఆవిష్కరించా రు.

district at the forefront: జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం...

కలెక్టర్‌ హనుమంతరావు

యాదాద్రి, జనవరి 26 (ఆంధ్రజ్యోతి) : అంకితభావంతో పనిచేసి జిల్లాను అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలుపుదామని కలెక్టర్‌ ఎం.హనుమంతరావు అన్నారు. సోమవారం 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూ నియర్‌ కళాశాలలో జాతీయజెండా ఆవిష్కరించా రు. పోలీసుల గౌరవవందం స్వీకరించిన అనంత రం కలెక్టర్‌ ప్రసంగిస్తూ మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో ఆర్టీసీ బస్సుల్లో 1.97లక్షలమహిళా ప్రయాణికులకు రూ.102.79కోట్లతో ఉచిత ప్రయాణం కల్పించామన్నారు. వంట గ్యాస్‌ సిలిండర్లను తక్కు వ ధరకు అందించాలని ఉద్దేశ్యంతో రూ.500 సబ్సిడీపై జిల్లాలో 5,56,172 సిలిండర్లను అందజేసి, రూ.17కోట్ల సబ్సిడీ వారి ఖాతాలలో జమ చేశామన్నారు. గృహజ్యోతిలో ఇప్పటివరకు రూ.96కోట్ల విలువైన విద్యుత్‌ను 1,50,568 మంది వినియోగదారులకు ఉచితంగా అందజేశామన్నారు. జిల్లాలో ని ఐదు నియోజికవర్గాల్లో 9,735 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయగా, నిర్మాణ దశను బట్టి రూ.195.10కోట్లు లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాలో జమ చేశామన్నారు. జిల్లాలో రేషన్‌దుకాణా ద్వారా 2.48 లక్షల కుటుంబాలకు 4,961 మెట్రిక్‌ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. వానాకాలం సాగుకు సంబంధించి 3,19,426 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, మద్దతు ధర కల్పించి రూ.758 కోట్లు నేరుగా రైతుల ఖాతా ల్లో జమచేశామని తెలిపారు. తాగునీటి ఎద్దడి నివారణ కోసం రూ.3.29కోట్ల ఎమ్మెల్యేల నిధులు, జిల్లా మినరల్‌ ఫండ్‌ నుంచి రూ.1.41కోట్లు నిధులు కేటాయించారని వెల్లడించారు.

16.17 లక్షల ఉపాధి పనిదినాలు

ఉపాధిహామీ పథకం ద్వారా 16.17లక్షల పనిదినాలు కల్పించి, రూ.71.04కోట్లు ఖర్చు చేశామని, చేయూత పథకం కింద మొత్తం 97,666 మంది లబ్ధిదారులకు నెలకు రూ.24.70కోట్లు పింఛన్ల రూపంలో పంపిణీ చేశామన్నారు. మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా రూ. 597.44కోట్ల రుణ సదుపాయం కల్పించామని, మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా స్త్రీ నిధి పథకం ద్వారా 475 స్వయం సహాయక సంఘాలకు రూ.13.38కోట్ల మంజూరు చేశామన్నారు. మెప్మాతో జిల్లాలోని మునిసిపాలిటీల్లోని బ్యాంకు లింకేజీ ద్వారా 845 స్వయం సహాయక సంఘాలకు రూ.114 కోట్లు, స్త్రీ నిధి ద్వారా 385 స్వయం సహాయక సంఘాలకు రూ.24.05 కోట్ల మంజూరుచేశామన్నారు. జిల్లాలో రూ.7.75కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణి చేసినట్టు వెల్లడించారు. మహిళలకు చీరల పంపిణీ కింద జిల్లాలో 2,30,394 చీరలు అందించామన్నారు. జిల్లా పంచాయతీల్లో రూ.8.07కోట్ల పన్నులు వసూలు చేశామన్నారు.

రైతు సంక్షేమం కోసం...

రైతుల సంక్షేమమే ప్రధాన కర్తవ్యంగా రాష్ట్ర ప్రభుత్వం భావించి, రైతు భరోసా పథకం కింద ఎకరానికి రూ.12వేల ఆర్థికసాయం 2,33,418 మంది రైతులకు రూ.306.46 కోట్లు వారి ఖాతా ల్లో జమ చేశామన్నారు. రుణమాఫీ 2024 కింద 77,660 మంది రైతులకు రూ.628.72కోట్లు మాఫీ చేశామన్నారు. రైతు బీమా పథకం కింద 2025- 26లో మరణించిన 186మంది రైతుల కుటుంబాలకు రూ.9.30కోట్లు వారి నామిని ఖాతాల్లో జమ చేశామన్నారు. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం ద్వారా 21 విడతల్లో రు.462.64కోట్లు ఆర్హులైన రైతుల ఖాతాలలో జమచేశామన్నారు. జిల్లాలో మూడేళ్లలో 4,500 ఎకరాలలో ఆయిల్‌పామ్‌ సాగును చేపట్టి, పంటకోతకు వచ్చిన 165 ఎకరాల నుంచి 56 మెట్రిక్‌ టన్నుల దిగుబడిని మిల్లులకు పంపించామన్నారు. కాళేశ్వరం ప్రాజె క్టు ప్యాకేజీ పనులు రూ.671 కోట్లతో 60ు పను లు పూర్తి చేశామన్నారు. గంధమల్ల జలాశయం పనులు కొనసాగుతున్నాయని, రూ.27.53కోట్ల వరకు భూపరిహారం చెల్లింపునకు నిధులు మం జూరైనట్లు వెల్లడించారు. బునాదిగాని, పిలాయిపల్లి, ధర్మారెడ్డికాలువల నిర్మాణం పనులు జరుగుతున్నాయని తెలిపారు. మత్స్యశాఖ ద్వారా 2.80కోట్ల చేపపిల్లలను 630 చెరువుల్లో వదలామ ని తెలిపారు. చేనేత,అనుబంధ కార్మికుల కోసం నేతన్నకు పొదుపు పథకం కింద 10,790 మంది నమోదు చేసుకోగా రూ.4.34కోట్ల విడుదల చేశామన్నారు.

వసతి గృహాల్లో రాత్రి బస...

జిల్లాలో 95 ప్రభుత్వ వసతి గృహాలను జిల్లా స్థాయి అధికారులు దత్తత తీసుకోని ప్రతి నెలా వాటిలో ఒకరోజు నిద్ర చేసి, సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్‌ హన్మంతరావు తెలిపారు. ప్రతీ ప్రభుత్వ వసతి గృహాలకు కామన్‌ మెనూ విధానాన్ని పాటిస్తున్నట్లు తెలిపారు. గిరిజన శాఖలో అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధిని నలుగురు విద్యార్థులకు రూ.80లక్షల మంజూరు చేశామన్నారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధిలో విదేశాలలో ఉన్నత విద్య చదువుకునేందుకు ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మహాత్మా జ్యోతిబాపూలే బీసీ ఓవర్సీస్‌ విద్యానిధి కింద రూ.20లక్షలు అందించామన్నారు. ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా 3,188 మంది బాలింతలకు, 4,842 మంది గర్భిణులకు, 20,825 మందికి 3 నుంచి 6 ఆరేళ్ల పిల్లలకు పోషక ఆహారం అందిస్తున్నామన్నారు. దివ్యాంగులకు ఎకనామికల్‌ రిహాబిటేషన్‌ అవార్డు 17మందికి మంజూరీ చేశామన్నారు. జిల్లాలో పదో తరగతి విద్యార్థులకు సబ్జెక్టు వారీగా అభ్యాస దీపికలు అందించామన్నారు. ఇంటర్మీడియేట్‌లో ఉత్తమ ఫలితాల సాధన కోసం నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖలో జిల్లాలో ఏడాదిలో 15,105 మందికి శస్త్రచికిత్సలకు రూ.45.60కోట్లు ఖర్చు చేశామన్నారు. జిల్లాలో ఫ్రెండ్లీ పోలీసు విధానాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తూ మన రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. అన్నిరంగాల్లో సమన్వయంతో పనిచేస్తూ జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలుపుదామని వెల్లడించారు. వివిధ పాఠశాల విద్యార్థులు వేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, ఎస్పీ అక్షాం్‌షయాదవ్‌, అదనపు కలెక్టర్‌ ఏ.భాస్కర్‌రావు పాల్గొన్నారు.

Updated Date - Jan 27 , 2026 | 01:03 AM