Share News

ఎంఎంటీఎస్‌కు భూసేకరణ ప్రారంభం

ABN , Publish Date - Apr 25 , 2026 | 12:01 AM

యాదాద్రి నుంచి ఘట్కేసర్‌ వరకు ఎంఎంటీఎస్‌ రెండో దశ విస్తరణ పనుల్లో అధికారులు వేగం పెంచారు. ఓ వైపు ప్రైవేట్‌ భూముల సే కరణకు సన్నాహాలు చేస్తునే, మరోవైపు నిర్మాణ సామగ్రిని పనుల ప్రాంతానికి తరలిస్తున్నారు.

ఎంఎంటీఎస్‌కు భూసేకరణ ప్రారంభం

భువనగిరి అర్బన్‌ కాలనీ, శ్రీరాంనగర్‌లో మార్కింగ్‌

నిర్మాణ సామగ్రి తరలింపు

భువనగిరిటౌన్‌, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): యాదాద్రి నుంచి ఘట్కేసర్‌ వరకు ఎంఎంటీఎస్‌ రెండో దశ విస్తరణ పనుల్లో అధికారులు వేగం పెంచారు. ఓ వైపు ప్రైవేట్‌ భూముల సే కరణకు సన్నాహాలు చేస్తునే, మరోవైపు నిర్మాణ సామగ్రిని పనుల ప్రాంతానికి తరలిస్తున్నారు. ఇప్పటికే ఈ మార్గంలోని రైలు పట్టాల వెంట 35ఎకరాల ప్రైవేట్‌ భూముల భూసేకరణకు రెవెన్యూశాఖ ఇటీవల నోటిఫికేషన్‌ జారీచేసిం ది. క్షేత్రస్థాయిలో రెవెన్యూ రైల్వే అధికారులు హద్దుల గుర్తింపునకు ప్రాథమిక సర్వే కూడా పూర్తిచేశారు. భువనగిరిలోని అర్బన్‌కాలనీ, శ్రీరాంనగర్‌లో ఎంఎంటీఎస్‌ కోసం సేకరించాల్సిన స్థలాల్లో డిజిటల్‌ సర్వే నిర్వహించి మా ర్కింగ్‌ చేశారు. మార్కింగ్‌ ఆధారంగా సుమా రు 50కిపైగా ఇళ్లను ప్రజలు కోల్పోనున్నారు. త్వరలోనే తుది సర్వే పూర్తిచేసి నిర్వాసితులకు పరిహారం అందజేసి భూములను స్వాధీనం చేసుకుని పనులను ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో ఇల్లు కోల్పోనున్న బాధితుల్లో ఆందోళన నెలకొంది. అలాగే రాయిగిరి, పగిడిపల్లి, బీబీనగర్‌లో కూడా హద్దుల గుర్తింపు సర్వే నిర్వహించనున్నారు.

అర్బన్‌కాలనీవైపు ఎంఎంటీఎస్‌ స్టేషన్‌

ప్రాథమిక సర్వే ప్రకారం పట్టణంలోని అర్బన్‌ కాలనీలోని అంబేడ్కర్‌నగర్‌ వైపు ఎంఎంటీఎస్‌ స్టేషన్‌ రానుంది. స్టేషన్‌ కోసం గుర్తించిన ప్రాంతాల్లో ప్రస్తుతం రైలు పట్టాల చివరి నుం చి 33మీటర్ల వరకు, మిగతా ప్రాంతాల్లో ప్రస్తు త రైల్వే హద్దుల నుంచి సుమారు 5మీటర్ల వరకు ప్రైవేట్‌ స్థలాలను సేకరిస్తున్నారు. ఎంఎంటీఎస్‌ ముఖద్వారం అర్బన్‌కాలనీ వైపు ఉంటుందా? లేక ప్రస్తుత స్టేషన్‌ వైపు అనుసంధానం చేస్తు లిప్టు, ఎస్కలేటర్‌తో కూడిన ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిలు ఏర్పాటు చేస్తారా అనేది తేలాల్సి ఉంది. అయితే అర్బన్‌కాలనీ వైపు ఎంఎంటీఎస్‌ స్టేషన్‌ ముఖద్వారం ఏర్పాటు చేస్తే అర్బన్‌కాలనీ రైల్వే గేటు ప్రయాణికులకు ప్రధాన అవరోధంగా మారనుంది. కాలనీలో నూతన రోడ్లనూ నిర్మిస్తారు.

నిర్మాణ సామగ్రి తరలింపు: ఎంఎంటీఎస్‌ పనులను రెండేళ్లలోపు పూర్తిచేసే లక్ష్యంతో రైల్వే అధికారులు ప్రణాళిక అమలు చేస్తున్నారు. ఓ వైపు ప్రైవేట్‌ భూసేకరణ చేస్తూనే మరోవైపు రైలు పట్టాల నిర్మాణ సామగ్రిని డంప్‌ చేస్తున్నారు. భూసేకరణతో నిమిత్తం లేని నిర్మాణ పనులను కూడా ప్రారంభించారు. రైల్వే స్థలాల్లో భారీ ట్యాంక్‌ నిర్మాణ పనులు పూర్తయ్యా యి. ప్రతిపాదిత పనులన్నీ సకాలంలో పూర్తయి, ఎంఎంటీఎస్‌ రైళ్లు వినియోగంలోకి రావాలని, నిర్వాసితులకు న్యాయం జరగాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Apr 25 , 2026 | 12:01 AM