Share News

చెరువులు వెలవెల

ABN , Publish Date - Oct 24 , 2026 | 12:15 AM

జిల్లాలో వర్షాలు లేక చెరువులు వెలవెలబోతున్నాయి. సాగునీటి వనరులు అడుగంటుతున్నాయి. ఎల్‌నినో ప్రభావానికి లోటు వర్షపా తం తోడైంది. అడపా.. దడపా కురిసిన వానలకు.. వానలకు నడుమ పెరిగిన విరామం పంటలను కుదేలు చేసింది. నోటికాడికొచ్చే తరుణంలో వరిపైర్లు ఎండిపోతున్నాయి. ఎదుగు, బొదుగులేని పత్తిపైరు దిగుబడిరాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

చెరువులు వెలవెల

జిల్లాలో కరువు జాడలు

అడుగంటుతున్న బోర్లు.. ఎండుతున్న వరిపైర్లు

616 చెరువుల్లో నీటిజాడ కరువు..

1,155 చెరువులకు నిండింది 38 మాత్రమే

జిల్లా వ్యాప్తంగా దుర్భిక్షఛాయలు

బీళ్లుగా మారుతున్న వరి పొలాలు

(ఆంధ్రజ్యోతి-యాదాద్రి) జిల్లాలో వర్షాలు లేక చెరువులు వెలవెలబోతున్నాయి. సాగునీటి వనరులు అడుగంటుతున్నాయి. ఎల్‌నినో ప్రభావానికి లోటు వర్షపా తం తోడైంది. అడపా.. దడపా కురిసిన వానలకు.. వానలకు నడుమ పెరిగిన విరామం పంటలను కుదేలు చేసింది. నోటికాడికొచ్చే తరుణంలో వరిపైర్లు ఎండిపోతున్నాయి. ఎదుగు, బొదుగులేని పత్తిపైరు దిగుబడిరాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

వానలు లేక జిల్లాలోని చెరువులు, కుంటలు ఎండిపోతున్నాయి. జిల్లావ్యాప్తంగా 17 మండలాల్లో 1,155 చెరువులు ఉండగా, సగానికిపైగా నీటిజాడలేదు. మొత్తం 616 చెరువుల్లో నీరు లేక వెలవెలబోతున్నాయి. గతేడాది అక్టోబరు, నవంబరులో కురిసిన భారీ వర్షాలు గత సంవత్సరం యాసంగికి, ఈ ఏడాది వానాకాలం పంటలకు కొద్దిపాటి ఊతమిచ్చాయి. అడుగంటుతున్న బోర్లు, ఎండుతున్న పైర్లతో జిల్లావ్యాప్తంగా కరువుఛాయలే అలుముకున్నాయి. యాసంగి పంటల సాగుకు చేయలేని పరిస్థితులతో వరిపొలాలు సైతం బీళ్లుగా మారుతున్నాయి.

జలాలు లేని చెరువులు, కుంటలు

జిల్లాలో వానాకాలంకంటే యాసంగి లో వరిపైరు సాగు, దిగుబడి గణనీయం సాధిస్తూ వస్తున్న రైతులను ఈ ఏడాది యాసంగి సాగు చేయలేక, బీళ్లుగా మా రుతున్న వరిపొలాలు వెక్కిరిస్తున్నాయి. వర్షాల్లేక చెరువులు, కుంటల్లో నీరు అడుగంటిపోతోంది. జిల్లాలో 1,155 చెరువులకుగాను 53.33శాతం అనగా, 616 చెరువులు, కుంటల్లో నీటి జాడలేదు. మరో 205 చెరువుల్లో 25 శాతం వరకు, 238 చెరువు ల్లో 50శాతం వరకు, 58 చెరువుల్లో 75శాతం వరకు నీటిమట్టం ఉన్నట్టుగా చిన్ననీటిపారుద ల శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో కేవలం 3.29శాతం 38 చెరువుల్లో మాత్రమే ఈ ఏడాది వానాకాలంలో నిండినట్లు నివేదికలు వెల్లడిస్తున్నా యి. ఈ 38 చెరువులు సైతం జిల్లామీదు గా ప్రవహించే మూసీ పరివాహక ప్రాంత గ్రామాల్లో చెరువులే కావడం గమనార్హం. హైదరాబాద్‌ నగర ఎగువ ప్రాంతంలో కురిసిన కొద్దిపాటి వర్షాలకు నగరంలోని మురికినీరు తోడుకావడంతో ఈ చెరువుల్లోకి చేరింది తప్ప వర్షాల వరదతో కాదని ఆయా గ్రామాల రైతులు పేర్కొంటున్నారు.

అడు గంటుతున్న బోర్లు

చెరువుల్లో నీరులేకపోవడంతో జిల్లాలో అత్యధికంగా ఆధారపడి వ్యవసాయం చేసే జలవనరు బోరుబావు లు అడుగంటుతున్నాయి. ఈ వానాకాలంలో వర్షాలు సకాలంలో కురవలేదు.జిల్లా సగటు సాధారణ వర్షపా తం 611మి.మీ.లు కాగా,వాస్తవంగా కురిసింది కేవలం 422. 6మి.మీ మాత్రమే. జిల్లాలో మొత్తంగా 31శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీంతో ఆశించినరీతిలో భూగర్భజలాలు పెరగలేదు. గత వానాకాలం కోతల దశలో తుఫాన్లు, భారీ వర్షాలు, యాసంగి పంటకాలంలో గోదావరి జలాలను జిల్లాలోని ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లోని కొన్ని మండలాలకు మళ్లించారు. అప్పటినుంచి ఇప్పటి వానాకాలం ముగిసినప్పటికీ, చెప్పుకోదగిన వర్షంలేకపోయినప్పటికీ భూగర్భజలాలు అందుబాటులో ఉన్నాయి. ఈ నీరే వానాకాలం వరిపైరు సాగుకు కూడా కొద్దిపాటి ఊతం ఇచ్చాయి. కానీ ఈసారి ఎల్‌నినో ప్రభావంతో వరుణుడి జాడలేదు. చెరువులు, కుంటలు వెలవెలబోతున్నాయి. వానాకాలం పంటలుసైతం కోత దశలోనే ఎండిపోతూ రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. లోటువర్షాలు, చెరువుల్లో నీరు ఎండుకుపోయి, భూగర్భజలాలు తగ్గుదలతో జిల్లావ్యాప్తంగా కరువుజాడలే అలుముకున్నాయి.

మూసీ పరివాహకంలో కొంత ఊరట

జిల్లాలోని 17మండలాల్లో వర్షాభావ పరిస్థితులే నెలకొన్నా యి. ఎక్కడ చూసినా పంటలు ఎండిపోతూ.. దిగుబడి తగ్గి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే జిల్లాలోని మూసీ పరివాహక ప్రాంత గ్రామాల్లో మాత్రం కొంత ఊరటగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో కేవలం 38 చెరువుల్లో నిండి ఉన్నాయనే నివేదికలో సైతం మూసీ పరివాహకంతగల నాలుగు మండలాల్లో కొద్దిపాటి చెరువులు మాత్రమే. హైదరాబాద్‌ నగరం నుంచి మూసీ మేడ్చెల్‌ మల్కాజిగిరి జిల్లా సరిహద్దున బీబీనగర్‌ మండలంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో అడుగిడుతుంది. ఈ మూసీ పరివాహక జలాలతో బీబీనగర్‌ మండలంలో మూడు చెరువులు పూర్తి జలమట్టంతో ఉన్నాయి. ఆ తర్వాత భూదాన్‌పోచంపల్లి మండలంలో 11 చెరువులు, వలిగొండ మండలంలో ఏడు చెరువులు, రామన్నపేట మండలంలో 17 చెరువులు మూసీ మురికిజలాలతో నిండుగా ఉన్నాయి. ఈ మండలాల్లో సైతం మూసీ పరివాహక ప్రాంతంలోని కేవలం కొద్దిపాటి గ్రామాల్లో మాత్రమే ఊరట కలుగుతుండగా, ఆ నాలుగు మండలాల్లోసైతం తీవ్ర కరువుఛాయలే అలుముకున్నాయి. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు యాసంగి పంటలసాగుతోపాటు వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రభావం చూపనుండటంతో రైతులు, ప్రజల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

కరువు అంచనాల్లో అధికారులు

: జిల్లాలో తీవ్రమైన కరువు అలుముకుంటుండంతో జిల్లా అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో అంచనాలకు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే గ్రామస్థాయిలో కరువు ఉపశమన సమగ్ర ప్రణాళికల రూపకల్పనకు గ్రామసభలు నిర్వహిస్తున్నారు. కరువు తీవ్రతను గ్రామాలవారీగా అంచనాలు వేయడానికి వ్యవసాయంతోపాటు భూగర్భజలాలు, తాగునీటి సరఫరా, పశుగ్రాసం, చెరువుల నీటిపట్టం తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులు వర్షపాతలోటు, పంటల పరిస్థితి, నీటి లభ్యత, క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా కరువు ప్రభావాన్ని అంచనా వేయనున్నారు.

జిల్లాలో చెరువుల్లో నీటి మట్టాల వివరాలు

చెరువుల్లో నీటి మట్టం చెరువుల సంఖ్య

0-25శాతం 616

25శాతంపైగా 205

50శాతంపైగా 238

75శాతంపైగా 58

100శాతం 38

Updated Date - Oct 24 , 2026 | 12:15 AM