కిరణ్‌కుమార్‌చార్యులకు ముఖ్య అర్చకుడిగా పదోన్నతి
ABN , Publish Date - Feb 19 , 2026 | 12:23 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానంలో అర్చకుడిగా కొనసాగుతున్న ఉండ్రుకొండ కిరణ్‌కుమార్‌చార్యులు బుధవారం ముఖ్య అర్చకుడిగా పదోన్నతి పొందారు.
యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానంలో అర్చకుడిగా కొనసాగుతున్న ఉండ్రుకొండ కిరణ్‌కుమార్‌చార్యులు బుధవారం ముఖ్య అర్చకుడిగా పదోన్నతి పొందారు. ఈయన 2013 సంవత్సరంలో అర్చక వృత్తిలో చేరి ఆలయంలో సుదర్శహోమం, పవిత్రోత్సవం, అధ్యయనోత్సవం, వార్షిక బ్రహ్మోత్సవాలు, స్వర్ణ గోపురం ఆవిష్కరణ, వివిధ పూజల్లో అనుభవం గడించారు. 2018 సంవత్సరంలో శాశ్వత ఉద్యోగం పొంది 2026ఫిబ్రవరిలో ముఖ్య అర్చకుడిగా పదోన్నతి లభించింది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల స్వస్తివాచనం రోజన పుణ్య ఘడియల్లో పదోన్నతి రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు కిరణ్‌కుమార్‌చార్యులు తెలపగా తోటి అర్చకులు శుభాకాంక్షలు తెలిపారు.