Share News

ఫార్మా కంపెనీలో ఉద్యోగ అవకాశాలు

ABN , Publish Date - May 26 , 2026 | 11:41 PM

నాగార్జునసాగర్‌, మే 26(ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీలోని నాట్కో ఫార్మా కంపెనీలో వివిధ విభాగాల్లో ఉద్యోగా అవకాశాలు ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఫార్మా కంపెనీలో ఉద్యోగ అవకాశాలు

నాగార్జునసాగర్‌, మే 26(ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీలోని నాట్కో ఫార్మా కంపెనీలో వివిధ విభాగాల్లో ఉద్యోగా అవకాశాలు ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీ ఫార్మసీ లేదా ఎంఏస్సీ కెమిస్ర్టీ చేసిన వారికి ఏఎం సూపర్‌వైజర్లుగా, అసిస్టెంట్‌ మేనేజర్‌గా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. 3 నుంచి 10 సంవత్సరాల అనుభవం ఉండాలని తెలిపారు. ఇంజనీరింగ్‌ విభాగంలో ఏజీఎం, హెచ్‌వోడీ, ఇన్‌చార్జిలుగా ఉద్యోగ అవకాలున్నాయని, ఈ ఉద్యోగాలకు బీటెక్‌ పూర్తి చేయడంతో పాటు మూడు నుంచి 10 సంవత్సరాల అనుభవం ఉండాలని పేర్కొన్నారు. మేర్‌హౌస్‌ ఉద్యోగాల కోసం బీఎస్సీ, డీ ఫార్మసీ, బీఫార్మసీ, మైక్రోబయాలజీ ఉద్యోగాలు కూడా ఉన్నట్లు తెలిపారు. ఈ ఉద్యోగాల కోసం ఏంఎస్సీ హైక్రోబయాలజీ చేసి ఉండాలని, 3నుంచి 6 సంవత్సరాల అనుభవం ఉండాలని తెలిపారు. ఈ నెల 31న హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ఉన్న హెడ్‌ ఆఫీసులో ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు.

Updated Date - May 26 , 2026 | 11:41 PM