అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
ABN , Publish Date - Oct 28 , 2026 | 11:43 PM
నల్లగొండ క్రైం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయ విద్యుత ట్రాన్సఫార్మర్లు, కాపర్, ఆయిల్, ట్రాన్సఫార్మర్ల విడి భాగాలను చోరీ చేస్తున్న నలుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు
నల్లగొండ క్రైం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయ విద్యుత ట్రాన్సఫార్మర్లు, కాపర్, ఆయిల్, ట్రాన్సఫార్మర్ల విడి భాగాలను చోరీ చేస్తున్న నలుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శరతచంద్రపవార్ వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్టు 22వ తేదీన నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్ బ్యాంక్‌పై ఉన్న ఎల్-15 లిఫ్ట్ ఇరిగేషన స్కీమ్ కు చెందిన 500 కేవీఏ ట్రాన్సఫార్మర్‌లో 300కిలోల కాపర్, 250 లీటర్ల ఆయిల్ చోరీకి గురైనట్లు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ధనావత పాండునాయక్ వేములపల్లి పోలీ్‌సస్టేషనలో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు ప్రత్యేక బృందాల ద్వారా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఈ నెల 28వ తేదీన వేములపల్లి గ్రామ శివారులోని సూర్యాపేట ఎక్స్ రోడ్డు వద్ద ఓ కారును తనిఖీ చేశారు. అందులోని ఓ వ్యక్తి గతంలో ట్రాన్సఫార్మర్ చోరీ కేసులో పాత నేరస్తుడిగా గుర్తించారు. కారుకు సంబంధించిన సరైన పత్రాలు చూపించకపోవడంతో వాహనాన్ని తనిఖీ చేయగా అందులో పానాలు, కట్టర్, గ్లౌజ్‌లు లభించాయి. ముగ్గురినీ అదుపులోకి తీసుకొని విచారించడంతో తాము గతంలో చాలా చోట్ల ట్రాన్సఫార్మర్ల నుంచి కాపర్, ఇతర సామగ్రి దొంగతనం చేశామని అంగీకరించారు.
హైదరాబాద్‌లో నివాసం.. హయతనగర్‌లో విక్రయం
చోరీ చేసిన వాటిని హయతనగర్‌లోని పాత సా మాను వ్యాపారి దేశీరామ్‌కు విక్రయించినట్లు విచారణలో తేలింది. తమ దగ్గర ఉన్న కాపర్‌ను విక్రయించేందుకు మిర్యాలగూడలోని వ్యాపారి చాంద్‌పాషా ఇంటికి వచ్చినట్లు చెప్పటంతో వ్యాపారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నిందితుల్లో మిర్యాలగూడకు చెందిన షేక్ చాంద్‌పాషా, పీఏపల్లి మండలం పడమటి తండాకు చెందిన రమావత సూర్య, మిర్యాలగూడకు చెందిన గల్లభ సాయికిరణ్, హైదరాబాద్‌కు చెందిన ఇస్లావత దేశీరామ్‌లు ఉన్నారు. వీరంతా హైదరాబాద్‌లో ఉంటూ నేరాలకు పాల్పడుతున్నారు. పట్టుబడిన నిందితులు గతంలో ఉభయ తెలుగు రాషా్ట్రల్లో 29 నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ ముఠాలోని ఐదుగురు సభ్యులు సంతోష్, నానకు, మోడల్ సాయి, ప్రియ, సునీత పరారీలో ఉన్నారు.
సులభ సంపాదనకు అలవాటుపడి.
జల్సాలకు అలవాటుపడిన తొమ్మిది మంది ముఠా సభ్యులు రోజువారీ చేస్తున్న పనులతో వచ్చిన డబ్బు సరిపోక సులభ సంపాదన కోసం చోరీలకు పాల్పడేవారు. నకిలీ నెంబరు ప్లేట్లు అమర్చుకుని కార్లలో తిరుగుతూ రాత్రి సమయాల్లో చోరీలకు పాల్పడేవారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు తమతోపాటు మహిళలను కూడా వాహనాల్లో తీసుకెళ్లేవారని గుర్తించారు. నిందితుల నుంచి రూ. 30లక్షల విలువైన రెండు కార్లు, రూ. 20లక్షల నగదు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ రవి పర్యవేక్షణలో కేసును సమర్థంగా ఛేదించినందుకు పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.