Share News

తల్లిదండ్రుల విగ్రహం ఏర్పాటు

ABN , Publish Date - Mar 06 , 2026 | 12:21 AM

పెన్‌పహాడ్‌, మార్చి 5(ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మం డలంలోని దూపహాడ్‌ గ్రామానికి చెందిన దివంగత పిన్నాని కనకయ్య, వెంకమ్మ దంపతులకు చిన్న కుమారుడు విగ్రహాలు ఏర్పాటు చేశారు.

తల్లిదండ్రుల విగ్రహం ఏర్పాటు

పెన్‌పహాడ్‌, మార్చి 5(ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మం డలంలోని దూపహాడ్‌ గ్రామానికి చెందిన దివంగత పిన్నాని కనకయ్య, వెంకమ్మ దంపతులకు చిన్న కుమారుడు విగ్రహాలు ఏర్పాటు చేశారు. సూర్యాపేట విద్యుత్‌ శాఖలో జిల్లా అకౌంట్‌ అధికారిగా పనిచేస్తున్న పిన్నాని మల్లికార్జున్‌ గురువారం తన వ్యవసాయ క్షేత్రంలో తల్లిదండ్రుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు రోజువారి కూలీ పనులు చేస ుకొని కుటుంబాన్ని పోషిస్తూ తనను చదివించారని తెలిపారు. వారి జ్ఞాపకార్థం విగ్రహాలు ఏర్పాటుచేసి ఆవిష్కరించినట్లు తెలిపారు. కనకయ్య వెంకమ్మ జ్ఞాపకార్థం అల్లుడు కీత కనకయ్య, కస్తూరిభాయ్‌ దంపతులు కార్యక్రమానికి వచ్చిన వారికి మామిడి, నిమ్మ మొక్కలు పంపిణీ చేశారు.

Updated Date - Mar 06 , 2026 | 12:21 AM