Share News

తనిఖీలతో తప్పు చేసే వారిలో భయం

ABN , Publish Date - May 27 , 2026 | 11:59 PM

సూర్యాపేట క్రైం, మే 27 (ఆంధ్రజ్యోతి) : పోలీసులు నిర్వహించే వాహనాల తనిఖీల ద్వారా తప్పుచేసే వారిలో భయం కలుగుతోందని కలెక్టర్‌ తేజ్‌సనందలాల్‌ పవార్‌ అన్నారు. బుధవారం రాత్రి జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా నాకాబందీ కార్యక్రమం నిర్వహించారు.

తనిఖీలతో తప్పు చేసే వారిలో భయం
బస్సులో తనిఖీ చేస్తున్న ఎస్పీ కొత్తపల్లి నర్సింహ, పక్కన కలెక్టర్‌ తేజస్‌నందలాల్‌ పవార్‌

కలెక్టర్‌ తేజస్‌నందలాల్‌ పవార్‌

సూర్యాపేట క్రైం, మే 27 (ఆంధ్రజ్యోతి) : పోలీసులు నిర్వహించే వాహనాల తనిఖీల ద్వారా తప్పుచేసే వారిలో భయం కలుగుతోందని కలెక్టర్‌ తేజ్‌సనందలాల్‌ పవార్‌ అన్నారు. బుధవారం రాత్రి జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా నాకాబందీ కార్యక్రమం నిర్వహించారు. కాగా సూర్యాపేట పట్టణంలోని ఖమ్మం రోడ్డులోని అమ్మ గార్డెన్స వద్ద ఎస్పీ కొత్తపల్లి నర్సింహతో కలిసి కలెక్టర్‌ వాహనాల తనిఖీని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వాహనాల తనిఖీల ద్వారా సామాన్యులకు ధైర్యం, భరోసా కలుగుతోందన్నారు. పోలీ్‌సశాఖ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన భద్రత, రక్షణ కల్పిస్తోందన్నారు. వాహనాల తనిఖీల ద్వారా అక్రమరవాణా, అసాంఘిక కార్యకలాపాలను నిరోధించవచ్చన్నారు. సమస్యలపై ఫిర్యాదులు అందిన వెంటనే పోలీసులు ప్రజల ఇంటి వద్దకు వచ్చి కేసులు నమోదు చేస్తున్నారని స్పష్టం చేశారు. ఎస్పీ కొత్తపల్లి నర్సింహ మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా, నేరాలను నిరోధించడం, బక్రీద్‌ పండుగ సందర్భంగా పశువుల అక్రమ రవాణాను నిరోధించడం లక్ష్యంగా నాకాబందీ నిర్వహించినట్లు వివరించారు. జిల్లాలో ఏకకాలంలో 23 ప్రాంతాల్లో, 9 చెక్‌పోస్టుల్లో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశామన్నారు. జిల్లా పోలీస్‌ శాఖ అనుక్షణం ప్రజల రక్షణ కోసం పనిచేస్తోందన్నారు. సమస్యలు ఉన్నప్పుడు ప్రజలు పోలీసులను నేరుగా కలిసి కానీ, డయల్‌-100 ద్వారా కానీ ఫిర్యాదు చేయవచ్చన్నారు. తనిఖీల్లో ఏఆర్‌ డీఎస్పీ నర్సింహాచారి, ఆర్‌ఐలు ప్రవీణ్‌కుమార్‌, జానయ్య, ఎస్‌ఐలు సాయిరాం, శివతేజ, వగ్గు వెంకన్న తదితరులు ఉన్నారు. పలు వాహనాలను, బస్సులను ఎస్పీ కొత్తపల్లి నర్సింహ స్వయంగా తనిఖీ చేశారు.

Updated Date - May 27 , 2026 | 11:59 PM