అంతర్జాతీయ వేదికపై మెరవనున్న‘ఇక్కత’
ABN , Publish Date - May 09 , 2026 | 12:24 AM
ప్యారిస్‌లో ఈనెల 17 నుంచి 21 వరకు జరిగే 79వ కేన్స ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా నిర్వహించే ఇంటర్నేషనల్ ఫ్యాషన షోలో పోచంపల్లి ఇక్కత వసా్త్రలు తళుక్కుమననున్నాయి.
ప్యారిస్‌లో 17నుంచి 21 వరకు ఇంటర్నేషనల్ ఫ్యాషన షో
ర్యాంప్‌వాక్ చేయనున్న పోచంపల్లి ఇక్కత బ్రాండ్ అంబాసిడర్ రష్మీఠాకూర్
భూదానపోచంపల్లి, మే 8 (ఆంధ్రజ్యోతి) : ప్యారిస్‌లో ఈనెల 17 నుంచి 21 వరకు జరిగే 79వ కేన్స ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా నిర్వహించే ఇంటర్నేషనల్ ఫ్యాషన షోలో పోచంపల్లి ఇక్కత వసా్త్రలు తళుక్కుమననున్నాయి. హౌజ్ ఆఫ్ వెండోమ్ ప్యారిస్, కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఫ్యాషన షో కు మన దేశం నుంచి తెలంగాణకు చెందిన మోడల్, నటి, మిస్ ఇండియా ప్యానెట్, మిస్ ఏషియా పసిఫిక్ ఇంటర్నేషనల్, మిస్ ఇండియా స్టార్ యూనివర్స్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ రష్మీ ఠాకూర్ పాల్గొంటున్నారని వీవర్స్ సర్వీస్ సెంటర్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ అరుణ్‌కుమార్ తెలిపారు. ఈ ఫ్యాషన షోలో ప్రధానంగా పోచంపల్లి ట్రెడిషనల్ ఇక్కత వసా్త్రలతో రెడ్ కార్పెట్ వాక్, ఫ్రీ ఈవెంట్ పార్టిసిపేషన, ర్యాంప్ అండ్ స్టైలింగ్ చేయనున్నారని వివరించారు. తద్వారా పోచంపల్లి ఇక్కత వసా్త్రలకు అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రాచుర్యం, గుర్తింపు లభించనుందని అన్నారు. జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని 2018లో పోచంపల్లిలో నిర్వహించిన ఫ్యాషన షోలో రష్మీ ఠాకూర్ పాల్గొని చేనేత ఇక్కత వసా్త్రలతో ర్యాంప్‌వాక్ నిర్వహించి అలరించారు. గతంలో పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారు. మరోసారి ఆమె ఇంటర్నేషనల్ ఫ్యాషన షోలో పోచంపల్లి ఇక్కత వసా్త్రలతో అలరించనున్నారు.