Share News

టెండరు రద్దు చేయకుంటే ఉద్యమం తప్పదు

ABN , Publish Date - Mar 28 , 2026 | 12:00 AM

యాదగిరిగుట్ట, మార్చి 27(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట దేవస్థానంలో ఇటీవల నిర్వహించిన టెండరును రద్దు చేయాలని, లేని యెడల పెద్దఎత్తున పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని బీఆర్‌ఎస్‌ పట్టణ సెక్రటరీ జనరల్‌ పాపట్ల నరహరి డిమాండ్‌ చేశారు

టెండరు రద్దు చేయకుంటే ఉద్యమం తప్పదు

యాదగిరిగుట్ట, మార్చి 27(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట దేవస్థానంలో ఇటీవల నిర్వహించిన టెండరును రద్దు చేయాలని, లేని యెడల పెద్దఎత్తున పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని బీఆర్‌ఎస్‌ పట్టణ సెక్రటరీ జనరల్‌ పాపట్ల నరహరి డిమాండ్‌ చేశారు. దేవస్థానం ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఈవో జే.భవానీశంకర్‌కు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. దేవస్థానం ఆదాయానికి గండి పడేలా వేలం పాట నిర్వహించిన టెండరును రద్దు చేయాలన్నా రు. టెండరుదారులు సిండికేట్‌ కావడంతో 75శాతం మేర నష్టం కలుగుతోందన్నారు. విచారణ జరిపి టెండరును రద్దు పర్చాలని డిమాండ్‌ చేశారు. వినతి ప త్రం అందజేసిన వారిలో పార్టీ నాయకులు దేవిపూజ అశోక్‌, మోతె నర్సింహులు, బాలు, విజయ్‌, శంకర్‌, మిట్ట వెంకటేశ్‌, సర్దార్‌, కంసాని స్వామి, ర్యాకల రాజు తదితరులు ఉన్నారు.

Updated Date - Mar 28 , 2026 | 12:00 AM