మార్చి మొదటివారంలో ఇళ్ల పంపిణీ
ABN , Publish Date - Feb 27 , 2026 | 12:45 AM
హుజూర్‌నగర్ పట్టణంలోని మోడల్‌కాలనీ ఇళ్లను మార్చి మొదటి వారంలో సీఎం రేవంతరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయనున్నట్లు మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోనే అతిపెద్ద మోడల్‌కాలనీ ఇదేనన్నారు.
హుజూర్‌నగర్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి) : హుజూర్‌నగర్ పట్టణంలోని మోడల్‌కాలనీ ఇళ్లను మార్చి మొదటి వారంలో సీఎం రేవంతరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయనున్నట్లు మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోనే అతిపెద్ద మోడల్‌కాలనీ ఇదేనన్నారు. గురువారం మోడల్‌కాలనీ ఇళ్ల పనులను కలెక్ట ర్ తేజ్‌సనందలాల్ పవార్, ఎస్పీ కొత్తపల్లి న ర్సింహతో కలిసి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పేదల సొంతింటి కల ను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలోనే అతిపెద్ద మోడల్ కాలనీకి శ్రీకారం చుట్టిందన్నారు. మొదటి విడతగా సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా మార్చి మొదటి వారంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. 15 ఏళ్ల కిందట మొదలుపెట్టిన మోడల్‌కాలనీ పనులు మార్చి నాటికి పూర్తవుతుండటం తో తన కల నెరవేరబోతుందన్నారు. ఒక్కో ఇం టికి రూ.10లక్షలకు పైగా ఖర్చు చేశామన్నారు. 2014లో బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడంతో కాలనీ నిర్మాణం పనులు నిలిచాయన్నారు. గత ప్రభుత్వం ఒక్కరూపాయి నిధులు కూడా కేటాయించకపోగా మోడల్‌కాలనీ ప్రాంతాన్ని డంపింగ్ యార్డుగా మార్చిందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో తిరిగి నిధులు మంజూరుచేయించి పనులు ప్రారంభించామన్నారు. రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. మొదటి విడతగా సీఎం తో 1000 ఇళ్లకు పట్టాలు అందిస్తామన్నారు. సీఎం పర్యటన షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 5.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామన్నారు. అనేక ఇళ్లు వివిధ దశలలో ఉన్నాయన్నారు. ప్రభుత్వం ప్రాధాన్య పథకాలలో సన్నబియ్యం, రేషన్‌కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లతో పాటుగా ధాన్యం కొనుగోళ్లు ఉన్నాయన్నారు. మంత్రి వెంట హౌసింగ్ పీడీ సిద్ధార్థ, మునిసిపల్ చైర్మన దొంతగాని శ్రీనివాస్, వైస్‌చైర్మన తన్నీరు మల్లికార్జున్, మాజీ ఎంపీపీ గూడెపు శ్రీను, యరగాని నాగన్న, దొంగరి వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు ధనమ్మ, ఉదయభాను, జ్యోతి, లలిత, నాగలక్ష్మి, హరిబాబు, అరుణ్‌కుమార్, ఆదెర్ల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
ఇరిగేషన పనులు సెప్టెంబరుకు పూర్తి
చింతలపాలెం, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి) : మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం పనులు సెప్టెంబరు నాటికి పూర్తిచేస్తామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. గురువారం మండలంలోని వెల్లటూరు వద్ద చేపడుతున్న ఎత్తిపోతల పథకం పనులను క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. పనుల పురోగతిపై ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూ సెప్టెంబర్ నాటి కి ప్రాజెక్టును పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రూ.1,450 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ఎత్తిపోతల పథకం ద్వారా చింతపాలెం, మేళ్లచెర్వు, మఠంపల్లి, హుజూర్‌నగర్ మండలాల్లోని 19 వేల కుటుంబాలకు, 53,000 ఎకరాల కు సాగునీరు అందుతుందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా 133 కేవీ సబ్‌స్టేషనను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. పంప్‌హౌస్ కాంక్రీట్ పనులు వేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. మంత్రి వెంట ఎస్‌ఈ నాగభూషణం, డీఈలు సత్యనారాయణ, బాలాజీ, కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ, కోదాడ డీఎస్పీ శ్రీనివా్‌సరెడ్డి, తహసీల్దార్ సూరయ్య, ఆర్‌వీఆర్ కాంట్రాక్టు అధికారులు, తిలక్, హరీ్‌షబాబు, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చిలకల శ్రీనివా్‌సరెడ్డి, నందిరెడ్డి ఇంద్రారెడ్డి, సీతారెడ్డి, దొండపాడు వెంకటరెడ్డి పాల్గొన్నారు.