Share News

కొత్త పింఛన్లపై ఆశలు!

ABN , Publish Date - Aug 01 , 2026 | 12:13 AM

కొత్తగా చేయూత పింఛన్ల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్న ల్‌ ఇచ్చింది. ఈ నెల15వ తేదీ నుంచి పింఛన్ల మం జూరుకు శ్రీకారం చుట్టనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఈమేర కు జిల్లా అధికార యం త్రాంగానికి ఆదేశాలు సైతం జారీ కావడంతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న దరఖాస్తుదారుల్లో కొత్త ఆశలు చిగురించాయి.

కొత్త పింఛన్లపై ఆశలు!

ఈ నెల 15 నుంచి చేయూత పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

25వేలకుపైగా దరఖాస్తులు.. కేటాయించే యూనిట్లు ఎన్నో?

(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): కొత్తగా చేయూత పింఛన్ల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్న ల్‌ ఇచ్చింది. ఈ నెల15వ తేదీ నుంచి పింఛన్ల మం జూరుకు శ్రీకారం చుట్టనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఈమేర కు జిల్లా అధికార యం త్రాంగానికి ఆదేశాలు సైతం జారీ కావడంతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న దరఖాస్తుదారుల్లో కొత్త ఆశలు చిగురించాయి.

జిల్లాలో కొన్నేళ్లుగా కొత్త పింఛన్ల మంజూరు ఊసే లేదు. వృద్ధాప్య, తదితర పింఛన్లకు వయో పరిమితిని సైతం 57 ఏళ్లకు ప్రభుత్వం కుదించిం ది. దీంతో వివిధ కేటగిరీల కింద చేయూత పింఛ న్ల కోసం మండల, మునిసిపల్‌ స్థాయిలో కుప్పలు, తెప్పలుగా దరఖాస్తులు వచ్చాయి. అయితే ప్రభుత్వం తాజాగా పింఛన్ల మంజూరుపై ప్రకటనలు చేయడంతో జిల్లాకు కేటాయించే యూనిట్లు ఎన్ని? అందులో అవకాశం దక్కుతుందా? లేదా? అని ఏళ్లుగా ఎదురుచూస్తున్న అర్హులైన దరఖాస్తుదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

25 వేలకు పైగా దరఖాస్తులు

కొత్తగా చేయూత పింఛన్ల కోసం మండల, మునిసిపల్‌ అధికారులు గతంలో దరఖాస్తులు తీసుకున్నారు. కొన్నేళ్లుగా విడతల వారీగా ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుంది. దీంతో కుప్పలు తెప్పలుగా ఆశావహులు దరఖాస్తులు చేసుకున్నారు. జిల్లాలోని 17 మండలాలు, ఆరు మునిసిపాలిటీల్లో పెద్ద సంఖ్యలో చేయూత దరఖాస్తులు వచ్చాయి. 2019 నుంచి ఆసరా పోర్టల్‌లో దరఖాస్తుల స్వీకరణ నిలిపివేసి తర్వాత, ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ‘చేయూత’ పేరుతో మళ్లీ దరఖాస్తులు తీసుకుంది. ‘ప్రజాపాలన’ పేరుతో నిర్వహించిన గ్రామ, వార్డు సభల్లో ప్రజాప్రతినిధుల సమక్షంలో పెద్ద సంఖ్యలో ఆశావహులు దరఖాస్తు చేసుకున్నా రు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా చేయూత పింఛ న్ల కోసం వివిధ కేటగిరీల వారీగా 25వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు చెబుతున్నా రు. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఆశావహులనుంచి తీ సుకున్న దరఖాస్తులను మండల స్థాయిలో ఎంపీడీవోలు, పట్టణాల్లో మునిసిపల్‌ కమిషనర్ల ఆధ్వర్యంలో పరిశీలించా రు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కేటాయించిన యూని ట్ల వారీగా ఎంపిక చేసేందుకు అవసరమైన వడపోత ఇప్పటికే ప్రారంభించామని అధికారులు చెబుతున్నారు.

ఏళ్లుగా ఎదురు చూపులే..

సాంఘిక భద్రత పథకంలో భాగంగా వివిధ వర్గాల ప్రజలకు చేయూత పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేస్తోంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా వృద్ధాప్య, వితంతు, ది వ్యాం గ, ఒంటరి మహిళలు, గీత, చేనేత, బీడీ కార్మికులతో పాటు పైలేరియా, డయాలిస్‌ వంటి వ్యాధి గ్రస్థులకు ప్రభు త్వం ‘చేయూత’ పింఛన్లు ఇస్తోంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 95,296 మందికి ప్రతీ నెల రూ.24,26,77,840 చెల్లిస్తున్నారు. అయితే గతంలో ఆసరా పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌ దరఖాస్తులు నిరంతర ప్రక్రియగా సాగి అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేసేవారు. అదే విధంగా వృద్ధాప్య పింఛన్లకు వయో పరిమితిని సైతం 60 నుంచి 57 ఏళ్లకు కుదించారు. అయితే ఆ తర్వాత ప్రభుత్వం ఆర్థిక భారం తగ్గించుకునేందుకు 2019 నుంచి పోర్టల్‌ ద్వారా దరఖాస్తుల ప్రక్రియను నిలిపివేసింది. దీం తో అర్హులైన లబ్ధిదారులు చేయూత పింఛన్లు అందించాలని ప్రజాపాలన గ్రామ సభలతో పాటు ‘ప్రజావాణి’ వంటి కార్యక్రమాల్లో అర్జీలు అందజేశారు. ఇటీవల పింఛన్లు మం జూరు చేస్తున్నారనే ప్రకటన వెలువడంతో పెద్దసంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. వాటిని మ్యానువల్‌గా తీసుకు న్న అధికారులు వాటి వివరాలను డిజిటలైజ్‌ చేసే పనిలో ఉన్నారు.

యూనిట్లు తక్కువ.. అర్హులు ఎక్కువ

ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేయూత పింఛన్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించినా అందుబాటు లో ఉన్న యూనిట్లు తక్కువగానే ఉండనున్నాయి. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో రెండు లక్షల చేయూత పింఛన్లు ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అదే విధంగా లైవ్‌ అథెంటికేషన్‌ వంటి ప్రక్రియల ద్వారా మరో లక్ష వరకు అనర్హులను గుర్తించింది. అయితే మొత్తంగా రాష్ట్ర వాప్తంగా మూడు లక్షల పింఛన్ల మంజూరు చేయనున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో అంతకు మూడింతలు కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ పింఛన్ల ఎంపిక ప్రక్రియ మార్గదర్శకాల ప్రకారం ఒంటరి మహిళలు, వితంతువులు, తలసేమియా వంటి రోగులతో పాటు దివ్యాంగులకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పింఛన్ల మంజూరులో అర్హత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. కుటుంబ ఆదాయం, భూములు, ఆస్తుల వివరాలు, ఇతర సంక్షేమ పథకాల లబ్ధి, సామాజికవర్గం వంటి అంశాలను అధికారులు పరిశీలించనున్నారు. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించిన అనంతరం నిజమైన అర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేసేందుకు అవసరమైన కసరత్తు చేస్తున్నారు.

Updated Date - Aug 01 , 2026 | 12:14 AM