జిల్లా ఆసుపత్రిలో హెల్ప్‌డెస్క్
ABN , Publish Date - Jul 02 , 2026 | 12:17 AM
భువనగిరి జిల్లా ఆసుపత్రిలో హెల్ప్ డెస్క్ అందుబాటులోకి వచ్చింది.
భువనగిరిటౌన, జూలై 1(ఆంధ్రజ్యోతి): భువనగిరి జిల్లా ఆసుపత్రిలో హెల్ప్ డెస్క్ అందుబాటులోకి వచ్చింది. దీంతో వైద్య చికిత్సల కోసం ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య చికిత్సల సమాచారాన్ని హెల్ప్‌డెస్క్ లో తెలుసుకునే వెసులుబాటు లభించింది. జబ్బు లక్షణాల ఆధారంగా హెల్ప్‌డె్‌స్కలో ఇచ్చే సూచనల మేరకు ఓపీలో పేరు నమోదు చేసుకుని సంబంధిత వైద్యుల వద్దకు వెళ్లి చికిత్సలు పొందుతున్నామని, అలాగే ఆసుపత్రి సమాచారం కూడా హెల్ప్‌డెస్క్ ద్వారా తెలుసుకుంటామని పలువురు అంటున్నారు. అయితే గత నెల 25న వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తు వచ్చిన సందర్భంగా ఆ ఒక్క రోజుకే ఆసుపత్రి వర్గాలు హడావుడిగా ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్ మరుసటి రోజే కనుమరుగు కావడంపై ‘ఆంధ్రజ్యోతి’ మినీలో 27న వచ్చి న కథనం మేరకు రెండు రోజుల క్రితం శాశ్వత ప్రాతిపదికన హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఇందు కోసం ప్రత్యేక సిబ్బందిని కూడా కేటాయించారు. ఫలితంగా ఆసుపత్రి సందర్శకులకు హెల్ప్‌డెస్క్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.