Share News

ఎత్తులు, పైఎత్తులు

ABN , Publish Date - Jan 27 , 2026 | 01:12 AM

మునిసిపాలిటీ నుంచి నగరపాలక సంస్థగా మారిన నల్లగొండను కైవసం చేసుకునేందుకు పార్టీలు ఎత్తులు, పైఎత్తులు వేస్తున్నాయి. గెలుపు కోసం అధికార, ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. 48 డివిజన్లతో విస్తరించిన నగరపాలక సంస్థలో పాగావేయడం వేసి సత్తా చాటాలని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజే పీ ప్రయత్నిస్తున్నాయి.

ఎత్తులు, పైఎత్తులు

కార్పొరేషన్‌ కైవసానికి పార్టీల వ్యూహాలు

కాంగ్రె్‌సని గెలిపించి అభివృద్ధికి సహకరించాలంటున్న మంత్రి వెంకటరెడ్డి

నగరం తమకే అనుకూలమంటోన్న కమలదళం

పాగావేసి తీరేది ఖాయమనే దీమాలో బీఆర్‌ఎస్‌ నేతలు

(ఆంధ్రజ్యోతిప్రతినిధి,నల్లగొండ): మునిసిపాలిటీ నుంచి నగరపాలక సంస్థగా మారిన నల్లగొండను కైవసం చేసుకునేందుకు పార్టీలు ఎత్తులు, పైఎత్తులు వేస్తున్నాయి. గెలుపు కోసం అధికార, ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. 48 డివిజన్లతో విస్తరించిన నగరపాలక సంస్థలో పాగావేయడం వేసి సత్తా చాటాలని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజే పీ ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు ముందే ఎత్తులు, పైఎత్తు లు, నినాదాలు, ప్రతినినాదాలతో నగరంలో రాజకీయసందడి సృష్టించాయి. కా ర్పొరేషన్‌ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేతలు అభ్యరుఽ్థలను ప్రకటించడ మే కాకుండా ప్రచారాన్ని సైతం ప్రారంభించడంతో నగరంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. నగరపాలక సంస్థగా మారిన తర్వాత తొలి ఎన్నికలు కావడంతో మేయర్‌ పీఠం దక్కించుకొని వ్యూహప్రతివ్యూహాలు పన్నుతున్నాయి.

నల్లగొండను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది తానేనని, కార్పొరేషన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించి తనకు మద్దతుగా నిలవాలనే నినాదాన్ని మంత్రి వెంకటరెడ్డి తెరమీదకు తెచ్చారు. ఇప్పటివరకు మునిసిపాలిటీగా ఉన్న నల్లగొండలో ప్రజల జీవనానికి అవసరమైన అన్నిరకాల సదుపాయాలను తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలోనే చేపట్టామని వివ రిస్తున్నారు. నగరం నలువైపులా అన్నిరకాల మౌలికసదుపాయాలు అందించింది తామేన నే ఎజెండాను ఓటర్ల ముందుకు తీసుకువస్తున్నారు. నల్లగొండను మరింతగా అభివృద్ధి చేసే లక్ష్యంతోనే సీఎం రేవంత్‌రెడ్డిని ఒప్పించి మరీ కార్పొరేషన్‌గా మార్చామని, భవిష్యత్‌లో నల్లగొండని మోస్ట్‌లివబుల్‌ సిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని మంత్రి పేర్కొంటున్నారు. ఇప్పటికే డివిజన్లవారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. కార్పొరేటర్లుగా బలమైన అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఆదివారం నాలుగు డివిజన్ల అభ్యర్థులను ప్రకటించి ఆయా వార్డుల్లో ప్రచారాన్ని సైతం ప్రారంభించారు. ఆరో డివిజన్‌ అభ్యర్థిగా కర్నాటి సునంద కరుణాకర్‌రెడ్డి, 25వ డివిజన్‌ అభ్యర్థిగా జూలకంటి ధనలక్ష్మిశ్రీనివాస్‌, 41వ డివిజన్‌ అభ్యర్థిగా కేసాని వేణుగోపాల్‌రెడ్డి, 19వ డివిజన్‌ అభ్యర్థిగా గోగుల గణేశ్‌ను ప్రకటించారు. డివిజన్ల వారీగా ఆశావహులు ఎక్కువగా ఉన్న చోట కాంగ్రెస్‌ సర్వేలు నిర్వహించి అభ్యర్థులను ఎంపికచేస్తోంది. టిక్కెట్‌ ఇవ్వలేకపోయిన అభ్యర్థులకు మంత్రి వెంకటరెడ్డి స్వయంగా నచ్చచెబుతూ సర్థుబాటు చేస్తున్నారు. షెడ్యూల్‌ వచ్చేలోగానే అభ్యర్థుల ఎంపిక పూర్తిచేసి కార్యరంగంలోకి దిగేందుకు కాంగ్రెస్‌ శ్రేణులు సిద్ధమయ్యాయి.

పనిచేసేవారికి అవకాశం ఇవ్వాలంటున్న బీఆర్‌ఎస్‌

నిత్యం జనంతో ఉండి, వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేసే నాయకులకు నల్లగొండ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పట్టం కట్టాలని బీఆర్‌ఎస్‌ కోరుతోంది. కొత్తగా ఏర్పాటైన కార్పొరేషన్‌లో అభివృద్ధికి పాటుపడే కొత్తతరానికి అవకాశం కల్పించాలని బీఆర్‌ఎస్‌ నేతలు కోరుతున్నారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి నేతృత్వంలో బీఆర్‌ఎస్‌ హయాంలోనే నల్లగొండ పట్టణంలో మౌలిక వసతుల కల్పన జరిగిందని, నల్లగొండలో జరిగిన అభివృద్ధి అది బీఆర్‌ఎస్‌ హయాంలోనేనని ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. డివిజన్లలో కొత్త, పాతల కలయికతో ప్రజాదరణ ఉన్న నాయకులనే బరిలో దింపడం ద్వారా అధికార కాంగ్రె్‌సని బీఆర్‌ఎస్‌ సవాల్‌ చేస్తోంది. మరోవైపు నగరంలో స్థిరమైన ఓటు బ్యాంకు, క్యాడర్‌ కలిగిన సీపీఎంతో పొత్తు పెట్టుకోవడం ద్వారా కలిసొస్తుందనే దీమా ఆపార్టీ నాయకుల్లో కనిపిస్తోంది. ఇప్పటికే దాదాపు అన్ని వార్డులకు అభ్యర్థులను ఎంపిక చేసిన ఆపార్టీ ఇక్కడ మేయర్‌ అభ్యర్థిగానూ బలమైన వారిని నిలబెట్టేందుకు తెరవెనక ప్రయత్నాలు చేస్తున్నట్లు క్యాడర్‌లో చర్చ సాగుతోంది. కార్పొరేషన్‌ ఎన్నికల్లో సత్తాచాటాలని, కీలకనేతలతో ప్రచారం సైతం నిర్వహించాలని పార్టీ నిర్ణయించినట్లు చెబుతున్నారు.

నగరం తమకే అనుకూలమంటోన్న కమలదళం

అర్బన్‌ ప్రాంతాల్లో పట్టున్న తమకు నల్లగొండ కార్పొరేషన్‌లో అనుకూలవాతావరణం ఉందని, ఈసారి ఎన్నికల్లో మెజార్టీ డివిజన్లు ఖాతాలో వేసుకోవడం ఖాయమని బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రధానంగా నగరపాలకసంస్థలకు కేంద్రం నుంచే నేరుగా అత్యధిక నిధులొస్తాయని, తమ అభ్యర్థే మేయర్‌గా ఉంటే మరిన్ని నిధులు తేవడానికి ఆస్కారముంటుందనే నినాదాన్ని ఆపార్టీ నేతలు ముందుకు తెచ్చారు. యువత, మహిళలు, చిరువ్యాపారులు, మధ్యతరగతివర్గాలు, ఉద్యోగుల్లో పార్టీకి ఆదరణ వచ్చిందని పేర్కొంటున్నారు. పార్టీలో అభ్యర్థుల ఎంపికకు జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ నాగం వర్షిత్‌రెడ్డి, పార్లమెంట్‌ కన్వీనర్‌ బండారు ప్రసాద్‌ నేతృత్వంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గతానికి భిన్నంగా ఒక్కోవార్డు నుంచి నలుగురైదుగురు అభ్యర్థులు పోటీపడుతున్నారని, సర్వేలు జరిపి అభ్యర్ధులను ఎంపికచేస్తున్నామని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం, నగర అభివృద్ధి, మౌలికసదుపాయాల కల్పన, స్మార్ట్‌సిటీగా మార్చడమే తమ నినాదమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 1995 తరహాలో పార్టీకి నగరంలో ఆదరణ కనిపిస్తోందని ఈ ఎన్నికల్లో గెలుపు తమదేనని ఆ పార్టీ నేతలు దీమాగా ఉన్నారు. రెండు మూడు రోజుల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తిచేసి ప్రచారం ముమ్మరం చేస్తామని, పార్టీ కీలకనేతలు ప్రచారానికి వస్తారని చెబుతున్నారు.

Updated Date - Jan 27 , 2026 | 01:12 AM