మహిళా సంఘాల సభ్యులకు ఆరోగ్యకార్డు
ABN , Publish Date - Mar 17 , 2026 | 12:37 AM
మహిళల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల మూడో వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాల్లోని సభ్యులకు వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో విడతల వారీగా పరీక్షలు నిర్వహించనున్నారు.
ప్రగతి ప్రణాళికలో భాగంగా 32 రకాల వైద్యపరీక్షలు
అనంతరం డిజిటల్ హెల్త్‌కార్డుల పంపిణీ
(ఆంధ్రజ్యోతి-అడ్డగూడూరు)
మహిళల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల మూడో వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాల్లోని సభ్యులకు వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో విడతల వారీగా పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లాల వారీగా కార్యాచరణ రూపొందించారు. అదేవిధంగా ప్రతి మహిళా సభ్యురాలికి 32 రకాల పరీక్షలు చేస్తారు. అనంతరం వారికి ఆరోగ్య కార్డును అందజేసేందుకు ప్రణాళికను రూపొందించారు. ముందు ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు, ఉపకేంద్రాల్లో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రుల్లో రక్త నమూనాలు సేకరించి జిల్లా కేంద్రంలోని డయాగ్నస్టిక్ సెంటర్‌కు పంపింస్తారు. ఈ పరీక్షలో వ్యాఽ దులు ఉన్నట్లు తెలితే వారికి వెంటనే చికిత్సలు సైతం అందిస్తారు.
కార్పొరేట్ ఆస్పుత్రిల్లోనూ వైద్యం
ఆరోగ్య కార్డుల ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ వైద్యసేవలు పొందే అవకాశం కల్పించనున్నారు. ఆయా కార్డుల్లో మహిళలకు నిర్వహించిన పరీక్షల ఫలితాలు కూడా నమోదై ఉంటాయి. ఈ క్రమంలో ఆసుపత్రులకు వెళ్లిన వారికి ఆనలైనలో కార్డు వివరాలు నమోదు చేయగానే పూర్వకు పరీక్షల ఫలితాలు అందుబాటులోకి వస్తాయి. దీంతో ప్రస్తుత మహిళ పరిస్థితి, పూర్వకు పరీక్షల ఆధారంగా చికిత్స అందిస్తారు. ఆరోగ్యశ్రీ కార్డుతో పాటు రూ.5 లక్షల వరకు ప్రత్యేకంగా వైద్యచికిత్సలు పొందవచ్చు.
రెండు, మూడు రోజుల్లో షెడ్యూల్
ఎస్‌హెచజీ మహిళ సభ్యులకు 32రకాల వైద్య పరీక్షలు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం ప్రభుత్వం డిజిటల్ హెల్త్ కార్డులను అందించనుంది. కాగా ఇందుకు సంబంధించిన షెడ్యూల్ వచ్చిన వెంటనే రోజుకు 50 నుంచి 60 మందికి చొప్పున మహిళా సభ్యుల రక్తనమూనాలను సేకరిస్తాం.
డాక్టర్ భార్గవి, అడ్డగూడూరు వైద్యాధికారి