Share News

నేడు చేనేత ‘సహకార’ఎన్నికలు

ABN , Publish Date - Jul 10 , 2026 | 12:12 AM

పోచంపల్లి చేనేత సహకార సంఘం ఎన్నికల్లో భాగంగా ఈనెల 10న శుక్రవారం పోలింగ్‌ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఎన్నికల నిర్వహణాధికారి మహ్మద్‌ యూసు్‌ఫఅలీఖాన, మేనేజర్‌ రుద్ర ఆంజనేయులు తెలిపారు.

నేడు చేనేత ‘సహకార’ఎన్నికలు
పోచంపల్లిలో ప్రచారం నిర్వహిస్తున్న భారత లవకుమార్‌ ప్యానల్‌

ప్రచారానికి తెర.. పోటాపోటీగా ప్రచారం

భూదానపోచంపల్లి, జూలై 9 (ఆంధ్రజ్యోతి) : పోచంపల్లి చేనేత సహకార సంఘం ఎన్నికల్లో భాగంగా ఈనెల 10న శుక్రవారం పోలింగ్‌ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఎన్నికల నిర్వహణాధికారి మహ్మద్‌ యూసు్‌ఫఅలీఖాన, మేనేజర్‌ రుద్ర ఆంజనేయులు తెలిపారు. సంఘంలో 644 మంది ఓటర్లు ఉండగా అందులో సుమారు 15 మంది చనిపోయిన వారి పేర్లు ఓటరు లిస్ట్‌లో ఉన్నాయి. పోచంపల్లితోపాటు హైదరాబాద్‌, ముక్తాపూర్‌, జలాల్‌పూర్‌, వంకమామిడి, భీమనపల్లి, జూలూరు గ్రామాల్లో సంఘం ఓటర్లు ఉన్నారు. అభ్యర్థులకు గుర్తులు కేటాయించడంతో ఎవరికి వారుగా ప్రచా రం ముమ్మరం చేశారు. కాంగ్రెస్‌ చైర్మన అభ్యర్ధి భారత లవకుమార్‌ ప్యానల్‌ అభ్యర్థులకు పోటీగా మాజీ చైర్మన భారత వాసుదేవ్‌ ప్యానల్‌ అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పద్మశాలి చేనేత కుటుంబీకులే సభ్యులు కావడంతో పట్టణంలోని పద్మశాలి కులంలోని పెద్దలను ప్రసన్నం చేసుకుని తమకు మద్దతు తెలపాలని కోరుతున్నారు.

చౌటుప్పల్‌ టౌన : చౌటుప్పల్‌ పట్టణంలోని చేనేత సహకార సంఘం పాలకవర్గానికి ఈ నెల 10వ తేదీన నిర్వహించే ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. 9 డైరెక్టర్‌ పదవులకు గాను 19 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఒక్కొక్క ఓటరు 9 ఓట్లు వేయవలసి ఉంటుంది. సంఘం పరిధిలో మొత్తం 549 మంది ఓటర్లకు గాను రెండు పోలింగ్‌ బూత లను ఏర్పాటు చేశారు. చేనేత సహకార సంఘానికి చెందిన పద్మశాలి పంక్షన హాల్‌లో పోలింగ్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్టు ఎన్నికల అధికారి ముజమిల్‌ తెలిపారు. కాగా చేనేత సహకార సంఘాల పాలక వర్గ ఎన్నికలకు సంబంధించి డీఎస్పీ మధుసూదన రెడ్డి ఆదేశాల మేరకు పటిష్టమైన బందోబస్తు ను ఏర్పాటు చేసినట్టు సీఐ మన్మథ కుమార్‌ తెలిపారు. మండలంలో చౌటుప్పల్‌ , కొయ్యల గూడెం, నేలపట్ల, కుంట్ల గూడెం చేనేత సహకార సంఘాల పాలక వర్గాలకు జరుగుతున్న ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టామని సీఐ తెలిపారు. ఒక్కో చేనేత సంఘం వద్ద ఒక ఎస్‌ఐ, నలుగురు కానిస్టేబుల్స్‌ను నియమించామని తెలిపారు. పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సీఐ కోరారు.

మోత్కూరు: మోత్కూరు చేనేత సహకార సంఘంలో 207 మంది ఓటర్లు ఉన్నారు. 7 జనరల్‌ డైరెక్టర్‌ స్థానాలకు 18 మంది, 2 మహిళా డైరెక్టర్‌ స్థానాలకు ఆరుగురు పోటీ పడుతున్నారు. సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ సంస్థ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాశికంటి లక్ష్మీనర్సయ్య, కాంగ్రెస్‌ నాయకుడు వంగరి రాములు, సీపీఎం పట్టణ మాజీ కార్యదర్శి కూరపాటి రాములు పోటీ చేయడంతో ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 9 మంది డైరెక్టర్లతో పాశికంటి లక్ష్మీనర్సయ్య, మరో 9 మంది డైరెక్టర్లతో వంగరి రాములు, ఆరుగురు డైరెక్టర్లతో కూరపాటి రాములు ప్యానళ్లు తయారు చేసుకుని ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. గెలిచిన 9మంది డైరెక్టర్ల నుంచే చైర్మన, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారిని ఎన్నుకుంటారు. ఈ నెల 10న ఓటింగ్‌ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అదే రోజు ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.

Updated Date - Jul 10 , 2026 | 12:12 AM