మైనంపల్లిలో గ్రూప్-1 అధికారుల బృందం పర్యటన
ABN , Publish Date - Feb 18 , 2026 | 12:47 AM
దేవరకొండ, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): మండలంలోని మైనంపల్లి గ్రామపంచాయతీని మంగళవారం గ్రూప్-1 శిక్షణ అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది.
దేవరకొండ, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): మండలంలోని మైనంపల్లి గ్రామపంచాయతీని మంగళవారం గ్రూప్-1 శిక్షణ అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. గ్రామంలోని అంగనవాడీ కేంద్రం, పల్లె దవాఖాన, రేషనదుకాణం పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. రెండు రోజులపాటు క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న ప్రభుత్వ పథకాల వివరాలను తెలుసుకోనున్నారు. బృందానికి దేవరకొండ ఎంపీడీవో పార్వతి, గ్రామ సర్పంచ కొర్ర రాంసింగ్‌నాయక్, అధికారులు స్వాగతం పలికారు. పర్యటించినవారిలో అధికారులు శ్రీయ, సంగీత, సాయితేజ, వెంకటరమణ, మహమ్మద్ అలీ ఉన్నారు.