Share News

ధాన్యం కాంటాలు ప్రారంభం

ABN , Publish Date - Apr 22 , 2026 | 12:00 AM

మోత్కూరు మండలంలోని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎట్టకేలకు మంగళవారం ధాన్యం కొనుగోలు, కాంటాలు వేయడం, తూకం వేసిన బస్తాలు మిల్లులకు తరలించడం ప్రారంభమైంది.

ధాన్యం కాంటాలు ప్రారంభం
మోత్కూరు మార్కెట్లో ధాన్యం తూకం వేసి డీసీఎంలో లోడ్‌ చేస్తున్న హమాలీలు

మోత్కూరు, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): మోత్కూరు మండలంలోని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎట్టకేలకు మంగళవారం ధాన్యం కొనుగోలు, కాంటాలు వేయడం, తూకం వేసిన బస్తాలు మిల్లులకు తరలించడం ప్రారంభమైంది. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చి రాశులు పోసి సుమారు 20 రోజులుగా ఎప్పుడు కొంటారా అని ఎదురుచూస్తున్నారు. రైతుల ఇబ్బందులను, అధికారుల నిర్లక్ష్యాన్ని ఈ నెల 15న ‘ప్రారంభోత్సవాలు సరే... కొనుగోళ్లేవి’ శీర్షిక, ఈ నెల 20న ‘ధాన్యం... దైన్యం’ శీర్షికన ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. దీంతో స్పందించిన అధికారులు కాంటాలు వేయించడం ప్రారంభించారు. మోత్కూరు సింగిల్‌ విండో ఆధ్వర్యంలో ఆరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఒక్క మోత్కూరులోనే కాంటాలు, బస్తాలు తరలించడం ప్రారంభమైంది. ఐకేపీ ఆధ్వర్యంలో 4 కేంద్రాలు ప్రారంభించగా ఒక్క పాటిమట్లలోనే తూకాలు, బస్తాల ఎగుమతి జరుగుతోంది. పాలడుగులో కేంద్రం నుంచి కూడా ఒక లోడ్‌ పంపారు. మిగతా కేంద్రాల్లో ఇంకా కాంటాలు ప్రారంభం కాలేదు. మోత్కూరు మార్కెట్‌లోని కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం తహసీల్దార్‌ జ్యోతి సందర్శించి రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మూడు కాంటాలు మాత్రమే ఉన్నాయని, మరో రెండు కాంటాలైన ఏర్పా టు చేయాలని రైతులు కొంతం బిక్షంరెడ్డి తదితరులు తహసీల్దార్‌ను కో రారు. సింగిల్‌ విండో అధికారులతో మాట్లాడతానన్నారు. మోత్కూరు మార్కెట్లో మూడు కాంటాలు, మిగతా చోట్ల ఒక్కో కాంటానే ఉన్నాయని, కాంటాల సంఖ్య పెంచాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై సంఘం కారదర్శి కె.వరలక్ష్మిని అడగ్గా మోత్కూరులో మూడు హమాలీ గుంపులు ఉన్నందున మూడు కాంటాలు, మిగతా చోట్ల హమాఈ గుంపు ఒక్కోటే ఉన్నందున ఒక్కో కాంటా ఇచ్చామన్నారు. ఉదయం కాంటావేసి, సా యంత్రం లారీలకు ఎత్తుతారన్నారు. తూకాలు వేసి రెండు, మూడు రోజు లు లారీలకు ఎత్తకుండా ఉంచితే తూకం తగ్గి మరో సమస్య వస్తుందన్నారు.

Updated Date - Apr 22 , 2026 | 12:00 AM