బీసీల్లో గౌడలే అధికం
ABN , Publish Date - Apr 17 , 2026 | 12:01 AM
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, కుటుంబ సర్వేపై నిపుణుల వర్కింగ్ గ్రూప్ నివేదిక ప్రకారం జిల్లాలో సామాజికవర్గాల వారీగా జనాభా వివరాలు వెల్లడయ్యాయి. జిల్లాలోని 17 మండలాలు, ఆరు మునిసిపాలిటీ ల పరిధిలో మొత్తం 2,60,766 కుటుంబాలు నివసిస్తుండ గా, జనాభా 8,06,347గా ఉంది.
ఎస్సీ కేటగిరిలో మాదిగలు 8 ఓసీల్లో రెడ్ల సంఖ్య ఎక్కువ
జిల్లా జనాభా 8.06లక్షలు 8 2.60లక్షల కుటుంబాలు
ఎస్సీలు 19.11శాతం, ఎస్టీలు 6.55శాతం
బీసీలు 59.82శాతం, బీసీ ముస్లింలు 3.12శాతం
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి) : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, కుటుంబ సర్వేపై నిపుణుల వర్కింగ్ గ్రూప్ నివేదిక ప్రకారం జిల్లాలో సామాజికవర్గాల వారీగా జనాభా వివరాలు వెల్లడయ్యాయి. జిల్లాలోని 17 మండలాలు, ఆరు మునిసిపాలిటీ ల పరిధిలో మొత్తం 2,60,766 కుటుంబాలు నివసిస్తుండ గా, జనాభా 8,06,347గా ఉంది. బీసీ కేటగిరిలో గౌడ సామాజికవర్గం జనాభా అగ్రస్థానంలో ఉండగా, ఎస్సీల్లో మాదిగ లు, ఓసీల్లో రెడ్ల జనాభా అధికంగా ఉంది.
జిల్లాలో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) కేటగిరీ కుటుంబాల సంఖ్య 48,753 కాగా, జనాభా 1,54,021 ఉంది. ఎస్సీ కేటగిరీలో 57 కులాలు, ఉపకులాలు ఉన్నాయి. షెడ్యూల్డ్ తెగల కేటగిరీలో 31 కులాలు, ఉపకులాలు ఉండగా, 15,494 కుటుంబాలు, జనాభా 52,686గా లెక్కతేల్చారు. అదే విధంగా వెనుకబడిన తరగతుల కేటగిరిలోని 133 కులాలుగా సర్వే నిర్వహించారు. వీరిలో ముస్లిం మైనార్టీ (బీసీ) కుటుంబాలు 8,124 ఉండగా, వీరి జనాభా 1,57,310గా ఉంది. వీరుగాక బీసీ వర్గాల కుటుంబాలు జిల్లాలో 1,57,310 ఉన్నాయి. జనాభా 4,80,978గా నివేదికలో వెల్లడించారు. ఇక ఓసీ వర్గాలకు చెందిన 19కులాలకు చెందిన కుటుంబాలు 31,085 ఉండగా, జనాభా 88,152గా నివేదికలో పేర్కొన్నారు. జిల్లాలో కులం వెల్లడించకుండా 730 కుటుంబాలు ఉండగా, జనాభా 2,318గా ఉంది.
గౌడ సామాజిక వర్గమే అధికం
జిల్లాలో బీసీ జనాభా 59.82శాతం ఉండగా, వారిలో గౌడ సామాజికవర్గం అగ్రస్థానంలో ఉంది. మొత్తం బీసీ జనాభా 4,80,978 కాగా, అందులో గౌడ సామాజికవర్గాల కు చెందినవారు 91,135 మంది (17.90శాతం) ఉన్నారు. గౌడ సామాజికవర్గం తర్వాత రెండో అతిపెద్ద సామాజికవర్గంగా యాదవ/గొల్లలు ఉన్నారు. వీరి జనాభా 79,179కాగా, మూడో స్థానంలో ముదిరాజులు 71,437 జనాభాతో నిలిచారు. ఆ తర్వాత స్థానాల్లో చేనేత వృత్తిదారులైన పద్మశాలి సామాజికవర్గం 47,381, కురమ సామాజికవర్గం 39,503, రజకులు 32,067, కొండలనుపిండిచేసి రాతి పనులు నిర్వహించే వడ్డెరులు 23,119, మున్నారుకాపు సామాజికవర్గం 16,018, మట్టి కుండలు తదితర వస్తువులు తయారీ చేసే కుమ్మరులు 15,615, వడ్రంగి సామాజికవర్గం 9,240, నాయిబ్రాహ్మణులు 7,63 గా ఉన్నారు. అదేవిధంగా కమ్మర సామాజికవర్గం 5074, స్వర్ణకారులు 4,550, తోగట్ట సామాజికవర్గం 3,688, వంశరాజులు 2,995, వీరశైవుల లింగాయతు జనాభా 1,695, పూల సామాజికవర్గ జనాభా 1,519గా ఉంది.
ఎవరి శాతం ఎంతంటే?
జిల్లా జనాభా 8,06,347కాగా, వీరిలో షెడ్యూల్ కులాల (ఎస్సీ) జనాభా 19.16శాతంగా ఉంది. షెడ్యూల్ తెగలు (ఎస్టీ) 6.55శాతం, అదే విధంగా వెనుకబడిన తరగతుల జాబితాలో ముస్లిం మైనార్టీలు (బీసీ) 3.12శాతం, బీసీలు 59.82శాతంగా ఉన్నారు. ఉన్నతవర్గాలకు చెందిన ఓసీ జాబితాల్లో 19 కులాలకు చెందిన జనాభా 10.96శాతంగా ఉంది.
మాదిగలు 1.15లక్షలు
జిల్లా వ్యాప్తంగా షెడ్యూల్డ్ కులాల కుటుంబాలు 48,753 ఉండగా, జనాభా 1,54,021గా నివేదికలో వెల్లడైంది. ఎస్సీ కేటగిరిలో అత్యధిక జనాభా ఉన్న సామాజికవర్గంగా మాదిగలు నిలిచారు. మొత్తం ఎస్సీ జనాభాలో 74.67శాతం మాదిగలు ఉన్నారు. మాదిక సామాజికవర్గానికి చెందిన 36,341 కుటుంబాలు ఉండగా, జనాభా 1,15,000గా పేర్కొన్నారు. ఆ తర్వాత రెండో స్థానంలో మాల సామాజికవర్గం కుటుంబాలు 6,940 ఉండగా, జనాభా 20,893 ఉన్నట్టుగా వెల్లడైంది. ఎస్సీ కేటగిరిలో మొత్తం 57 సామాజికవర్గాల సర్వే నిర్వహించగా, అతి తక్కువ జనాభా ఉన్న సామాజికవర్గంగా మాతంగి కులస్థులు ఉన్నారు. ఈ సామాజికవర్గానికి చెందిన కుటుంబాలు రెండే ఉండగా, జనాభా కేవలం ఐదుగురు మాత్రమే.
ఎస్టీల్లో లంబాడాలే ..
జిల్లాలో ఎస్టీ కేటగిరీలో 31 సామాజికవర్గాల సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఎస్టీ కుటుంబాలు 15,494 ఉండగా, జనాభా 52,686గా నివేదికలో పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం జనాభాలో లంబాడి/సుగాలి/ బంజరా సామాజికవర్గం అత్యధికంగా 85.58శాతం కాగా, మిగతా 30 సామాజికవర్గాల జనాభా కేవలం 14.42శాతంగా మాత్రమే ఉంది. జిల్లాలో లంబాడా సామాజికవర్గం కుటుంబాలు 13,238 ఉండగా, జనాభా 45,615 ఉన్నట్టుగా సర్వే నివేదికలో వెల్లడించారు. మిగతా ఎస్టీ కేటగిరిలోని సామాజికవర్గాల జనాభా నామమాత్రంగానే నమోదైంది.
జిల్లాలో సామాజికవర్గాల వారీగా జనాభా
కేటగిరీ కుటుంబాలు జనాభా శాతం
ఎస్సీ 48,753 1,54,021 19.16
ఎస్టీ 15,494 52,686 6.55
బీసీలు 1,57,310 4,80,978 59.82
బీసీముస్లిం 8,124 28,192 3.51
ఇతరులు 31,085 88,152 10.96
మొత్తం 2,60,766 8,04,029 100
బీసీ కేటగిరీ : కుటుంబాలు 1,57,310, జనాభా 4,80,978
సామాజికవర్గం కుటుంబాలు శాతం జనాభా శాతం
గౌడ 30,013 18.14 91,135 17.90
గొల్ల/యాదవ 25,471 15.40 79,179 15.15
ముదిరాజ్ 22,951 13.87 71,437 14.03
పద్మశాలి 15,641 9.45 47,381 9.31
కురుమ 13,164 7.96 39,503 7.76
రజక 10,727 6.48 32,067 6.40
వడ్డెర 7,279 4,37 23,119 4.54
మున్నురుకాపు 5,461 3.30 16,018 3.15
కుమ్మర 5,114 3.09 15,615 3.07
వడ్రంగి 3,069 1.86 9,240 1.81
నాయిబ్రాహ్మణ 2,496 1.51 7,635 1.50
కమ్మర 1,771 1.04 5,074 1.00
స్వర్ణకారులు 1,458 0.88 4,550 0.89
తోగుట్ట 1,365 0.83 3,688 0.72
వంశరాజులు 972 0.59 2,995 0.59
వీరశైవలింగాయత్ 584 0.35 1,695 0.33
ఎస్సీ కేటగిరీ : కుటుంబాలు 48,753, జనాభా 1,54,021
సామాజికవర్గం కుటుంబాలు శాతం జనాభా శాతం
మాదిగ 36,341 74.74 1,15,000 74.67
మాల 6,940 14.24 20,893 13.56
ఎస్టీ కేటగిరీ : కుటుంబాలు 15,494, జనాభా 52,686
సామాజికవర్గం కుటుంబాలు శాతం జనాభా శాతం
సుగాలి, లంబాడ,
బంజారా 13,238 85.44 45,615 85.58
ఓసీ/ ఇతర కేటగిరీ : కుటుంబాలు 31,085, జనాభా 88,152
సామాజికవర్గం కుటుంబాలు శాతం జనాభా శాతం
రెడ్డి 25,285 81.34 70,131 79.56
వైశ్య 2,514 8.09 7,863 8.92
బ్రాహ్మణ 500 1.61 1,505 1.71
కాపు, నాయుడు 440 1.42 1,333 1.51
కమ్మ, చౌదరి 252 0.81 800 0.91
వెలమ 274 0.88 784 0.89