Share News

కరువును ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలం

ABN , Publish Date - Jul 21 , 2026 | 12:41 AM

కరువును ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి విమర్శించారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కరువును ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలం

150టీఎంసీలు వృథాగా సముద్రంపాలు

మాజీ మంత్రి జగదీ్‌షరెడ్డి

నల్లగొండ, జూలై 20 (ఆంధ్రజ్యోతి): కరువును ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి విమర్శించారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వారసుడు తెలంగాణలో పాలన చేస్తున్నారని, దీంతో మన రాష్ట్ర రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి ఏపీ ఈ ఏడాది అక్రమంగా 50టీఎంసీలు తరలించకుపోయిదని ఆరోపించారు. కన్నెపల్లి పంప్‌హౌ్‌సను ఇప్పుడు ఆన్‌ చేసినా ఏడు జిల్లాలకు సాగు, తాగునీటిని అందించవచ్చన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అజ్ఞానం వల్లే రైతులు, ప్రజలు నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే 150 టీఎంసీలు వృథాగా సముద్రంలోకి పోయాయన్నారు. ఉమ్మడి జిల్లాలో కరువును ఎదుర్కోవడంలో వైఫల్యం చెందిందని, వర్షాలు లేనప్పుడు ఆరుతడి పంటలు ఎలా సాగుచేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో రోజుకు కనీసం 12గంటలు కూడా విద్యుత్‌ ఇవ్వడం లేదన్నారు. రానున్న రోజుల్లో నల్లగొండతో పాటు హైదరాబాద్‌కు తాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. ఇరిగేషన్‌ మంత్రి ఉత్తమ్‌కు అవగాహన లేదని, నల్లగొండ మంత్రి గురించి చెప్పుకోవడం అనవసరమన్నారు. కలెక్టరేట్‌లో ఉత్తమ్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ పెట్టి అబద్ధాలు చెబుతున్నారని, ఆయనకు ధైర్యం ఉంటే తనతో చర్చకు సిద్ధం కావాలని సవాల్‌ విసిరారు. మరో 10 నుంచి 15 రోజుల్లో రిజర్వాయర్లలోని నీళ్లు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చెరువులను నింపాలన్నారు.

Updated Date - Jul 21 , 2026 | 12:41 AM