గీతకార్మికులకు సాయంలో ప్రభుత్వం విఫలం
ABN , Publish Date - Jul 02 , 2026 | 12:16 AM
తాటిచెట్టు పైనుంచి పడి గాయపడినా, మరణించినా గీత కార్మికుల కుటుంబాలకు ఆర్థికసహాయం, బీమా సాయం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి శ్రీనివా్‌సగౌడ్ అన్నారు.
తుంగతుర్తి, జూలై 1 (ఆంధ్రజ్యోతి) : తాటిచెట్టు పైనుంచి పడి గాయపడినా, మరణించినా గీత కార్మికుల కుటుంబాలకు ఆర్థికసహాయం, బీమా సాయం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి శ్రీనివా్‌సగౌడ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ జిల్లాలో ప్రైవేట్‌కార్యక్రమానికి వెళ్తున్నారు. మార్గమధ్యలో కర్విరాలకొత్తగూడెం గ్రామ గౌడ కులస్థుల కోరిక మేరకు కంఠమహేశ్వరస్వామి దేవాలయంలో నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చేతివృత్తులు కనుమరుగైతే మానవ మనుగడ లేదన్నారు. కులవృత్తుల పరిరక్షణ కోసం కృషి చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని అన్నారు. అనంతరం గౌడ కులస్థులతో కలిసి కల్లు తాగారు. అంతకుముందు తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గీత కార్మికులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో కొత్తగూడెం సొసైటీ అధ్యక్షుడు వర్ధెల్లి లింగయ్య, వగలగాని వెంకన్న, గౌడ సంఘం మండల అధ్యక్షుడు మద్దెల నరసయ్య, లక్ష్మయ్య, దశరథ, సందీప్, వీరభద్రం, వెంకన్న, నారాయణ, సుదర్శన, కొత్తగూడెం సర్పంచ ఎం రమేష్, వెలిశాల వెంకటరత్నం, వెలిశాల శేఖర్, నలమాస హుస్సేన ఉన్నారు.